National Logistics Policy : దేశానికి మోదీ పుట్టిన రోజు బహుమతి... 2.2 కోట్ల మందికి ప్రయోజనం...

ABN , First Publish Date - 2022-09-16T00:11:20+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ

National Logistics Policy : దేశానికి మోదీ పుట్టిన రోజు బహుమతి... 2.2 కోట్ల మందికి ప్రయోజనం...

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని ప్రారంభించబోతున్నారు. వస్తువులు దేశవ్యాప్తంగా అంతరాయాలు లేకుండా రవాణా అయ్యే విధంగా చేయడం కోసం ఈ విధానం ఉపయోగపడుతుంది. ప్రాసెస్ రీఇంజినీరింగ్, డిజిటైజేషన్, మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్‌లపై ప్రధానంగా ఇది దృష్టి సారిస్తుంది. 


వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయాల్ తెలిపిన వివరాల ప్రకారం, మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని ఆవిష్కరిస్తారు. దేశం నలుమూలలకు ఎటువంటి అంతరాయాలు లేకుండా వస్తువులు, ఉత్పత్తుల రవాణా జరగాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని రూపొందించారు. ప్రాసెస్ రీఇంజినీరింగ్, డిజిటైజేషన్, మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్‌లపై ప్రధానంగా ఇది దృష్టి సారిస్తుంది. 


నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2020 బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. లాజిస్టిక్స్ కోసం జీడీపీలో దాదాపు 14 శాతం వరకు ఖర్చవుతుండటంతో దేశీయ వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్లో పోటీని ఎదుర్కొనే సామర్థ్యం తగ్గిపోతోంది. లాజిస్టిక్స్ విషయంలో అభివృద్ధి చెందిన జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఈ ఖర్చు జీడీపీలో ఎనిమిది శాతం లేదా తొమ్మిది శాతం మాత్రమే ఉంటోంది. 


లాజిస్టిక్ సెక్టర్‌లో 20కిపైగా ప్రభుత్వ ఏజెన్సీలు, 40 పార్టనర్ గవర్నమెంట్ ఏజెన్సీలు, 37 ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్, 500 సర్టిఫికేషన్లు, 10,000కుపైగా కమోడిటీస్, 160 బిలియన్ డాలర్ల మార్కెట్ సైజ్ ఉన్నాయి. దీనిలో 200 షిప్పింగ్ ఏజెన్సీలు, 36 లాజిస్టిక్స్ సర్వీసెస్, 129 ఇన్లాండ్ కంటెయినర్ డిపోలు, 166 కంటెయినర్ ఫ్రెయిట్ స్టేషన్స్, 50 ఐటీ ఎకోసిస్టమ్స్, బ్యాంకులు, బీమా సంస్థలు ఉన్నాయి. దేశంలో లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గాలని ప్రభుత్వం భావిస్తోంది. 


కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, లాజిస్టిక్స్ సెక్టర్లో 22 మిలియన్ల మంది జీవనోపాధి పొందుతున్నారు. పరోక్ష లాజిస్టిక్స్ ఖర్చులు 10 శాతం తగ్గే విధంగా ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం ఈ నూతన విధానం లక్ష్యం. దీనివల్ల ఎగుమతులు ఐదు శాతం నుంచి ఎనిమిది శాతం వరకు వృద్ది చెందుతాయని అంచనా. 


Updated Date - 2022-09-16T00:11:20+05:30 IST