UAE President మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం

ABN , First Publish Date - 2022-05-14T17:28:29+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆకస్మిక మృతి పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్విటర్ ద్వారా సంతాపం తెలియజేశారు.

UAE President మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆకస్మిక మృతి పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్విటర్ ద్వారా సంతాపం తెలియజేశారు. "షేక్ ఖలీఫా బిన్ జాయెద్ ఆకస్మిక మృతి పట్ల చాలా బాధగా ఉంది" అని మోదీ ట్వీట్ చేశారు. దివంగత యూఏఈ ప్రెసిడెంట్ గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గల నాయకుడు అని కొనియాడారు. అతని ఆధ్వర్యంలో భారత్-యూఏఈ సంబంధాలు అభివృద్ధి పథంలో కొనసాయని చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయ సమాజం యూఏఈ ప్రజలతో ఉన్నారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాని ప్రార్థించారు. భారత విదేశాంగ శాఖమంత్రి ఎస్ జైశంకర్ కూడా యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతిపై తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు.  




1948లో జన్మించిన ఖలీఫా 2004లో అత్యంత ధనిక ఎమిరేట్ అబుదాబిలో అధికారంలోకి వచ్చి దేశాధినేత అయ్యారు. ఇప్పుడాయన సవతి సోదరుడు, క్రౌన్ ప్రిన్స్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అబుదాబి తదుపరి పాలకుడు అయ్యే అవకాశం ఉంది. షేక్‌ ఖలీఫా మృతికి పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. ఖలీఫా మృతి నేపథ్యంలో ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వశాఖలతో పాటు ప్రైవేటు రంగంలోనూ దాదాపు 40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. అలాగే, మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు.

Read more