ప్రగతి మైదాన్‌లో చెత్తను చేతితో తీసివేసిన ప్రధాని

ABN , First Publish Date - 2022-06-19T21:16:08+05:30 IST

ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కింద కొత్తగా నిర్మించిన ఐటీపీఓ టన్నెల్‌ను ప్రధానమంత్రి..

ప్రగతి మైదాన్‌లో చెత్తను చేతితో తీసివేసిన ప్రధాని

న్యూఢిల్లీ: ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కింద కొత్తగా నిర్మించిన ఐటీపీఓ టన్నెల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారంనాడు ఆసక్తిగా పర్యవేక్షించారు. టన్నెల్ చుట్టూ కలియతిరుగుతూ టన్నల్‌ పేవ్‌మెంట్‌పై కనిపించిన చెత్త, ఒక ప్లాస్టిక్ బాటిల్‌ను చేత్తో తీసివేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టన్నల్‌ గోడలపై చిత్రీకరించిన పెయింట్లను ప్రధాని ఆసక్తిగా తిలకిస్తూ, మధ్యమధ్యలో తనకు పేవ్‌మెంట్ మీద కనిపించిన చెత్తను ఉత్తచేతులతో తీసివేయడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను పశ్చిమబెంగాల్ బీజేపీ కో-ఇన్‌చార్జి అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. ''పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే నిబద్ధతకు మోదీ కట్టుబడి ఉన్నారు. ఐటీపీఐ టన్నెల్ ప్రారంభోత్సవం సమయంలోనూ చెత్తను ఏరివేయడం ద్వారా ఆయన అందరికీ ఒక ఉదాహరణగా నిలిచారు'' అని మాలవీయ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజక్ట్‌లో భాగంగా ప్రధాన టన్నెల్, ఐదు అండర్‌పాసెస్‌లను ప్రధానమంత్రి ఆదివారంనాడు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును రూ.920 కోట్లతో నిర్మించగా, మొత్తం నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. న్యూవరల్డ్ క్లాస్ ఎగ్లిబిషన్‌‌గా ప్రగతి మైదాన్‌ను తీర్చిదిద్దడం ద్వారా ఎగ్జిబిటర్లు, విజిటర్లు ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో  పాల్గొనేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది.

Updated Date - 2022-06-19T21:16:08+05:30 IST