భవాని 'సారి' ట్వీట్.. రిప్లై ఇచ్చిన ప్రధాని

ABN , First Publish Date - 2021-07-27T13:57:29+05:30 IST

'నీ శాయశక్తులా ప్రయత్నించావ్. అది చాలు. నీ సేవలకు భారత్ గర్విస్తోంది' అంటూ ప్రధాని మోదీ ఒలింపిక్ క్రీడాకారిణి భవానీకి భరోసా ఇచ్చారు. టోక్యో ఒలింపిక్స్ ..

భవాని 'సారి' ట్వీట్.. రిప్లై ఇచ్చిన ప్రధాని

న్యూఢిల్లీ: 'నీ శాయశక్తులా ప్రయత్నించావ్. అది చాలు. నీ సేవలకు భారత్ గర్విస్తోంది' అంటూ ప్రధాని మోదీ ఒలింపిక్ క్రీడాకారిణి భవానీకి భరోసా ఇచ్చారు. టోక్యో ఒలింపిక్స్‌లో భవాని ఫెన్సింగ్ క్రీడలో భారత్ తరపున పోటీ పడ్డారు. కానీ పథకం నెగ్గలేకపోయారు. దీంతో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించారు. ఈ క్రమంలోనే భవాని ట్విటర్ వేదికగా భారతీయులందరికీ క్షమాపణ చెప్పారు. 'నేను నా శాయశక్తులా ప్రయత్నించాను. కానీ పథకం గెలవలేకపోయాను. సారీ' అని ఆ ట్వీట్ లో రాయసుకొచ్చారు. ఈ ట్వీట్ కు స్వయంగా ప్రధాని మోదీ రిప్లై ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.



Updated Date - 2021-07-27T13:57:29+05:30 IST