జూలై 4న భీమవరానికి ప్రధాని మోదీ

Published: Sun, 03 Jul 2022 12:43:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జూలై 4న భీమవరానికి ప్రధాని మోదీ

కృష్ణా:  ఏపీలో ప్రధాని మోదీ  పర్యటించనున్నారు. భీమవరంలో జూలై 4వ తేదీ నిర్వహించే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 150 జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు.  మోదీ పర్యటన నేపథ్యంలో  జూలై 3 వ తేదీ అధికారులు ట్రయిల్ రన్ నిర్వహించారు.  విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎస్పీజీ బలగాలు విమానాశ్రయం పరిసరాలను  క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ప్రధాని రాక దృష్ట్యా విమానాశ్రయం పరిసరాల్లో  పోలీసులు 144 సెక్షన్  విధించారు.


TAGS: BJP modi
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.