6 నమామీగంగా మెగా ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన నేడు

ABN , First Publish Date - 2020-09-29T12:09:09+05:30 IST

నమామీ గంగా మిషన్ కింద ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 6 మెగా ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు శంకుస్థాపన చేయనున్నారు...

6 నమామీగంగా మెగా ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన నేడు

న్యూఢిల్లీ : నమామీ గంగా మిషన్ కింద ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 6 మెగా ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు శంకుస్థాపన చేయనున్నారు.గ్రామపంచాయతీల్లో పానీ సమితుల ఏర్పాటు ద్వారా జల జీవన్ మిషన్ కార్యక్రమం కింద ప్రతి ఇంటికి జలం నినాదంతో రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ కార్యక్రమ లోగోను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.జగజీత్ పూర్, హరిద్వార్, రిషికేష్, లక్కడ్ ఘాట్ లలో ఎస్టీపీతోపాటు రక్షిత మంచి నీటి పథకాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. హరిద్వార్- రిషికేష్ జోన్ లో 80 శాతం వ్యర్థజలాలు గంగానదిలో వృథాగా పోతున్నాయని, వాటిని ఎస్టీపీల ద్వారా మళ్లించి గంగా నదిని పరిశుభ్రంగా ఉంచుతామని ప్రధాని కార్యాలయ అధికారులు చెప్పారు.


చోర్పానీ, బద్రీనాథ్ ప్రాంతాల్లో మూడు ఎస్టీపీలకు ప్రధాని మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు.గంగా అవలోకన్ పేరిట మొట్టమొదటి మ్యూజియాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.హరిద్వార్ లోని చండీఘాట్ లో గంగా అవలోకన్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. క్లీన్ గంగా ప్రాజెక్టులతోపాటు వన్యప్రాణుల సంస్థను ప్రధాని మోదీ నేడు శ్రీకారం చుట్టనున్నారు.

Updated Date - 2020-09-29T12:09:09+05:30 IST