ఒబామా కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్

ABN , First Publish Date - 2022-03-14T16:03:08+05:30 IST

కరోనా వైరస్ బారిన పడిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా త్వరగా కోలుకోవాలని...

ఒబామా కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్

న్యూఢిల్లీ:కరోనా వైరస్ బారిన పడిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా త్వరగా కోలుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. బరాక్ ఒబామాను ట్యాగ్ చేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.‘‘కొవిడ్-19 నుంచి మీరు త్వరగా కోలుకోవాలి,మీ కుటుంబం మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బరాక్ ఒబామాతో నరేంద్రమోదీకి మంచి స్నేహం ఉంది. గతంలో ఒబామా అధ్యక్షుడిగా పనిచేసినపుడు మోదీతో తరచూ మాట్లాడుతుండేవారు. పాత స్నేహం దృష్ట్యా సోమవారం కరోనా సోకిన ఒబామా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్ చేశారు. 


Updated Date - 2022-03-14T16:03:08+05:30 IST