రోబోలుగా మారకండి : మోదీ

ABN , First Publish Date - 2021-12-28T20:53:55+05:30 IST

నిమ్మళంగా ఉండే పరిస్థితుల్లో ఉండాలని కోరుకోవడానికి బదులుగా

రోబోలుగా మారకండి : మోదీ

న్యూఢిల్లీ : నిమ్మళంగా ఉండే పరిస్థితుల్లో ఉండాలని కోరుకోవడానికి బదులుగా సవాళ్ళను ఎంచుకోవాలని విద్యార్థులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇప్పుడు కొత్తవాటి గురించి భయం అనేదే లేదన్నారు. యావత్తు ప్రపంచాన్ని తెలుసుకునే సత్తా విద్యార్థులకు ఉందన్నారు. ‘ఫలానా విషయం తెలియదు’ అనే ప్రశ్నే ఇక లేదని, అత్యుత్తమమైనదాని కోసం అన్వేషణ, యావత్తు ప్రపంచాన్ని జయించాలనే కల ఉన్నాయని చెప్పారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూరు 54వ స్నాతకోత్సవంలో మంగళవారం ఆయన మాట్లాడారు. 


అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థలో వెచ్చించిన సమయం విద్యార్థుల్లో పెను మార్పులను తీసుకొచ్చిందన్నారు. వారికి ఐఐటీ కాన్పూరు ఓ గొప్ప వేదికను అందుబాటులో ఉంచిందని చెప్పారు. విద్యార్థులు సవాళ్ళను ఎంచుకోవాలని, నిమ్మళం (కంఫర్ట్)గా ఉండే పరిస్థితులను కాదని తెలిపారు. ఇప్పుడు తెలియనివాటి గురించి భయమే లేదన్నారు. యావత్తు ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగే సత్తా విద్యార్థులకు ఉందని చెప్పారు. ఫలానా విషయం తెలియదనే ప్రశ్నే ఇక లేదని, అత్యుత్తమమైనదాని కోసం అన్వేషించవచ్చునని, యావత్తు ప్రపంచాన్ని జయించాలని కలలుగనవచ్చునని తెలిపారు. 


విద్యార్థులు పొందిన శిక్షణ, సంపాదించిన నైపుణ్యం, విజ్ఞానం కచ్చితంగా ఈ ప్రపంచంలో తమదైన ముద్ర వేసుకోవడానికి దోహదపడతాయని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి, విజేతలుగా నిలవాలని చెప్తూ, రోబోలుగా మారిపోవద్దని హెచ్చరించారు. అంశాలపై ఇంటర్నెట్‌లో పని చేయాలని, అయితే ఆయా అంశాల భావోద్వేగాలను మర్చిపోకూడదని తెలిపారు. 


మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 25 ఏళ్ళు పూర్తయ్యేనాటికి మనం మన కాళ్ళపై నిలబడటానికి ఎంతో చేసి ఉండవలసిందన్నారు. అప్పటి నుంచి చాలా ఆలస్యం జరిగిందని, మన దేశం చాలా సమయాన్ని కోల్పోయిందని అన్నారు. ఇప్పటి వరకు రెండు తరాలు గడిచిపోయాయని, ఇక కనీసం రెండు క్షణాలనైనా మనం కోల్పోకూడదని స్పష్టం చేశారు. 


ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-28T20:53:55+05:30 IST