చాముండేశ్వరిని దర్శించుకోనున్న ప్రధాని Narendra modi

ABN , First Publish Date - 2022-06-15T16:50:02+05:30 IST

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు మైసూరుకు వస్తు న్న ప్రధాని నరేంద్రమోదీ ఇదే సందర్భంగా చాముండేశ్వరి అమ్మవారి దర్శనం

చాముండేశ్వరిని దర్శించుకోనున్న ప్రధాని Narendra modi

                                        - చురుగ్గా ఏర్పాట్లు 


బెంగళూరు, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు మైసూరుకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఇదే సందర్భంగా చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఈనెల 20న చాముండేశ్వరి కొండలకు వెళ్లి ప్రధాని ప్రత్యేక పూజల్లో పాల్గొనే అవకాశం ఉంది. 21న ఉదయం 6.30 నుంచి 7.45 వరకు మైసూరు ప్యాలెస్‌ మైదానంలో జరిగే యోగా దినోత్సవంలో పాల్గొంటారు. అరగంటపాటు మైసూరు రాజకుటుంబీకులతో ప్రధాని గడపనున్నారు. అనంతరం కేరళలోని తిరువనంతపురంనకు ప్రత్యేక విమానంలో బయల్దేరుతారు. 20న బెంగళూరుకు రానున్న ప్రధాని సబర్బన్‌ రైల్వే పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం డాక్టర్‌ అం బేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ క్యాంప్‌సను ప్రారంభిస్తారు. సాయం త్రం హెలికాప్టర్‌ ద్వారా మైసూరుకు చేరుకుంటారు. సుత్తూరు మఠాన్ని సందర్శించిన అనంతరం చాముండేశ్వరి కొండలకు వెళ్లి అమ్మవారి దర్శనం పొందుతారని అక్కడి నుంచి బ్లూప్లాజా హోటల్‌లో బస చేస్తారని అధికారులు మంగళవారం వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో భక్తులను అనుమతించబోరని తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని కార్యాలయ భద్రతా విభాగం చాముండేశ్వరి కొండలకు చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలిస్తోంది.

Updated Date - 2022-06-15T16:50:02+05:30 IST