జపాన్ నూతన ప్రదానిని అభినందించిన మోదీ

ABN , First Publish Date - 2021-10-09T00:29:31+05:30 IST

జపాన్ నూతన ప్రధాన మంత్రి ఫుమియో కిషిడను భారత దేశ

జపాన్ నూతన ప్రదానిని అభినందించిన మోదీ

న్యూఢిల్లీ : జపాన్ నూతన ప్రధాన మంత్రి ఫుమియో కిషిడను భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అభినందించారు. భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మ, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కలిసి కృషి చేద్దామన్నారు. ఈ వివరాలను మోదీ ఓ ట్వీట్‌లో తెలిపారు. కిషిడను ప్రధానిగా జపాన్ పార్లమెంటు ఇటీవల ఎన్నుకుంది. 


జపాన్ ప్రధాన మంత్రిగా ఫుమియో కిషిడ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులో మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు తన శరీరం, ఆత్మలను అంకితం చేస్తానన్నారు. నూతన శకాన్ని తీర్చిదిద్ది, సుసంపన్న హృదయాలుగల ప్రజలతో కూడిన దేశాన్ని తదుపరి తరానికి అందజేస్తానన్నారు. 


ఫుమియో కిషిడ శుక్రవారం భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ నేపథ్యంలో మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, జపాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఫుమియో కిషిడను అభినందించానని తెలిపారు. భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం, ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సహకారాన్ని పెంచుకోవడం కోసం ఆయనతో కలిసి కృషి చేయడానికి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-10-09T00:29:31+05:30 IST