INS Vikrant Commissioned: భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్

ABN , First Publish Date - 2022-09-02T17:20:52+05:30 IST

స్వదేశంలో నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు....

INS Vikrant Commissioned: భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్

కొచ్చి(కేరళ): స్వదేశంలో నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.(INS Vikrant Commissioned)శుక్రవారం కేరళ రాష్ట్రంలోని కొచ్చి నౌకాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించారు. 20వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ నౌకతోపాటు కొచ్చిన్ నౌకాశ్రయంలో ఆటోమేషన్ సౌకర్యాలను ప్రధాని మోదీ ప్రారంభించారు.262 మీటర్ల పొడుగు ఉండే ఈ బాహుబలి ఐఎన్ఎస్ విక్రాంత్(INS Vikrant) నౌకను.. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో తయారుచేశారు.


 ఇప్పటిదాకా మనదేశంలో తయారైన అతి పెద్ద యుద్ధనౌక ఇదే.థ్రోటిల్‌ కంట్రోల్‌ రూమ్‌.. విక్రాంత్‌ నౌకకు గుండెలాంటిది ఇది. నౌకకు కావాల్సిన విద్యుత్తు సరఫరాకు అవసరమైన నాలుగు గ్యాస్‌ టర్బైన్‌ ఇంజన్లను ఈ గది నుంచే నడిపిస్తారు. ఈ నాలుగు ఇంజన్లూ కలిసి 88 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి.


Updated Date - 2022-09-02T17:20:52+05:30 IST