ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు

ABN , First Publish Date - 2022-06-18T16:23:28+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ రెండురోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం ఈనెల 20న వస్తున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌

ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు

                 - ఏర్పాట్లను పరిశీలించిన హోంశాఖ మంత్రి జ్ఞానేంద్ర


బెంగళూరు, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ రెండురోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం ఈనెల 20న వస్తున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ శుక్రవారం విడుదలైంది. ఢిల్లీలో ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం 9.15 గంటలకు బయల్దేరే ప్రధాని 11.55 గంటలకు యలహంక ఎయిర్‌బేస్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో కొమ్మఘట్ట హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. ఇక్కడ బెంగళూరు సబర్బన్‌ రైల్వే ప్రాజెక్టు శంకుస్థాపనలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. అనంతరం ఆయన హెలిక్యాప్టర్‌లో బెంగళూరు యూనివర్సిటీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ క్యాంపస్‌ (బేస్‌)కు చేరుకుంటారు. ప్రధాని కోసం బేస్‌లో ప్రత్యేక హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు ఆయన ఇక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ, బేస్‌ నూతన క్యాంపస్‌ ప్రారంభోత్సవం, 150 సీట్లతో ఆధునికీకరించుకున్న ఐటీఐను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం హెలీక్యాప్టర్‌లో మైసూరుకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు మహారాజ కళాశాల మైదానంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రో డ్డు మార్గంలో సుత్తూరు మఠానికి చేరుకుని మఠాధిపతి శివరాత్రి దేశికేంద్రస్వామిజీ ఆశీస్సులు అందుకుంటారు. అనంతరం మఠంలో వేదపాఠశాల భవంతులను, యోగా భక్తికేంద్రా న్ని ప్రారంభిస్తారు. రాత్రి 7.30 గంటలకు ఆయన చాముండేశ్వరి కొండలకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. మైసూరులోని ర్యాడిసన్‌ బ్లూప్లాజాలో ప్రధాని రాత్రి బస చేయనున్నారు. 21న ఉదయం 6.30 గంటలకు మైసూరు ప్యాలె్‌సలో యోగా ర్యాలీకి పచ్చజెండా చూపుతారు. ఉదయం 8.30 గంటలకు ప్యాలె్‌సలో జరిగే అంతర్జాతీయ యోగా ఉత్సవంలో పాల్గొంటారు. వేలాదిమందితో కలసి యోగాసనాలు చేస్తారు. అనంతరం ఆయన ఉదయం 9.25 గంటలకు మైసూరు విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి కేరళలోని తిరువనంతపురం బయల్దేరుతారు. ప్రధాని పర్యటనలో గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌, ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, పలువురు కేంద్ర, రాష్ట్రమంత్రులు పాల్గొంటారు. బెంగళూరులో ప్రధాని పాల్గొంటున్న కార్యక్రమాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర స్వయంగా పరిశీలించారు. ఆయన వెంట నగర పోలీస్‌ కమిషనర్‌ ప్రతా్‌పరెడ్డి, ఉన్నతాధికారులు ఉన్నారు. 

Updated Date - 2022-06-18T16:23:28+05:30 IST