ఆమె క్యాచ్‌కు ప్రధాని కూడా ఫిదా..!

ABN , First Publish Date - 2021-07-12T08:40:11+05:30 IST

టీమిండియా ఆల్‌రౌండర్ హర్లీన్ డియోల్ పట్టిన ఓ క్యాచ్ కొద్ది రోజులు నెట్టింట తెగ హల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో..

ఆమె క్యాచ్‌కు ప్రధాని కూడా ఫిదా..!

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ హర్లీన్ డియోల్ పట్టిన ఓ క్యాచ్ కొద్ది రోజులు నెట్టింట తెగ హల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళా ఆల్‌రౌండర్ హర్లీన్.. అదరిపోయే స్టన్నింగ్ క్యాచ్‌తో క్రికెట్ అభిమానులందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ క్యాచ్‌పై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఫిదా అయ్యారు. గత శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో హర్లీన్ ఈ క్యాచ్ అందుకుంది. మ్యాచ్‌లో టీమిండియా ఓడినప్పటికీ.. హర్లీన్ పట్టిన ఈ క్యాచ్ మాత్రం కోట్ల మంద్రి క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, బిజినెస్ టైకూన్  ఆనంద్ మహీంద్ర వంటి వాళ్లు కూడా హర్లీన్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. 


Updated Date - 2021-07-12T08:40:11+05:30 IST