Bjpకి వలసపోకుండా అడ్డుకట్ట వేయండి

ABN , First Publish Date - 2022-06-03T15:25:36+05:30 IST

బీజేపీ మాయమాటలకు లొంగి తమ పార్టీ నుండి యువకులు ఆ పార్టీలో చేరుతున్నారంటూ పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే)వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌

Bjpకి వలసపోకుండా అడ్డుకట్ట వేయండి

                         - పీఎంకే నేత రాందాస్‌


చెన్నై, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): బీజేపీ మాయమాటలకు లొంగి తమ పార్టీ నుండి యువకులు ఆ పార్టీలో చేరుతున్నారంటూ పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే)వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో కొన్ని జిల్లాల్లో పార్టీకి దశాబ్దాలతరబడి సేవలందించిన యువకులంతా బీజేపీలో చేరుతున్నట్లు తనకు సమాచారం అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే పార్టీ పగ్గాలు స్వీకరించిన అన్బుమణి పార్టీ నుండి యువకులు బీజేపీలో చేరకుండా అడ్డుకోవాలని సూచించారు.. ఓ వైపు ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే మిత్రపక్షమైన బీజేపీపై గత రెండు రోజులుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీతో సహవాసం అన్నాడీఎంకేకు తీవ్రనష్టం కలిగిస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇదే విధంగా గతంలో అన్నాడీఎంకే కూటమిలో మిత్రపక్షంగా ఉండిన పీఎంకే కూడా బీజేపీ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ ఆ పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు. ఈ రెండు పార్టీలు ప్రస్తుతం బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై కలవరపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు  రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంక్‌ కలిగిన పీఎంకే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ దిశగానే పార్టీ నుంచి యువత బీజేపీలో చేరకుండా  నిఽఘా వేయాలని భావిస్తోంది. పీఎంకేకు మంచి బలం ఉన్న ఉత్తరాది జిల్లాల్లో బీజేపీ నేతలు పీఎంకేకు చెందిన యువకులను కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా సాయం అందిస్తామని, పార్టీలో చేరితే పదవులు ఇప్పిస్తామంటూ మాయమాటలతో లొంగదీసుకుంటున్నారు. ఆ హామీలతో ఆ జిల్లాలలోని పీఎంకేకు చెందిన యువకులంతా బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే పీఎంకే సీనియర్‌ నేతలు, మాజీ శాసనసభ్యులు, వన్నియార్ల సంఘాలకు చెందిన నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్లు సమాచారం. ఈ వివరాలు తెలుసుకున్నప్పటి నుంచి పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్‌ కంటిమీద కునుకుపడటం లేదు. ఇకపై పార్టీకి చెందిన యువకులెవరూ బీజేపీలో చేరకుండా జిల్లాల నాయకులు కట్టుదిట్టం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. యువత కోసం పార్టీ పరంగా రిజర్వేషన్ల కోసం, తమిళుల సంక్షేమం కోసం, వన్నియార్ల అభివృద్ధికోసం చేపడుతున్న చర్యలను యువకులకు వివరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-06-03T15:25:36+05:30 IST