పోచంపల్లి చీరపై బెంగాల్‌ ఎంపీ ప్రశంసలు

ABN , First Publish Date - 2021-09-17T06:11:27+05:30 IST

పోచంపల్లి చేనేత టైఅండ్‌డై పట్టు చీరపై పశ్చిమబెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మొహువ మోయిత్రా ప్రశంసలు కురిపించారు.

పోచంపల్లి చీరపై బెంగాల్‌ ఎంపీ ప్రశంసలు
పోచంపల్లి చీరలో ఎంపీ

భూదాన్‌పోచంపల్లి, సెప్టెంబరు 16: పోచంపల్లి చేనేత టైఅండ్‌డై పట్టు చీరపై పశ్చిమబెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మొహువ మోయిత్రా ప్రశంసలు కురిపించారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా పోచంపల్లి చేనేత వస్త్రాలు అద్భుతంగా ఉంటాయన్న ఆమె పోచంపల్లి చీర అందాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. గత వారం హైదరాబాద్‌లో పర్యటించి ఐటీపైన ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సభ్యులకు మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ప్రభుత్వం తరఫున పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత్‌ వస్త్రాలను అందించారు. పోచంపల్లి చేనేత వస్త్రాలను గురువారం తన ట్విట్టర్‌ వేదికగా ప్రశంసించిన ఎంపీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.   

Updated Date - 2021-09-17T06:11:27+05:30 IST