కొత్త పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ విడుదల

ABN , First Publish Date - 2021-04-22T01:03:11+05:30 IST

కొత్త పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ విడుదల

కొత్త పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ విడుదల

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పోకో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. భారత మార్కెట్‌లో పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ రీలోడెడ్ 4జీబీ ర్యామ్, క్వాడ్ రియర్ కెమెరాలతోపాటు 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ కొత్త పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 9,499 ఉంటుంది. కొత్త పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

Updated Date - 2021-04-22T01:03:11+05:30 IST