రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య: దోషికి మరణశిక్ష

ABN , First Publish Date - 2021-01-22T00:31:51+05:30 IST

రెండున్నరేళ్ల చిన్నారిపై పాశవికంగా అత్యాచారానికి తెగబడి, ఆపై హత్య చేసిన వ్యక్తికి ప్రత్యేక పోక్సో కోర్టు

రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం,  హత్య: దోషికి మరణశిక్ష

న్యూఢిల్లీ: రెండున్నరేళ్ల చిన్నారిపై పాశవికంగా అత్యాచారానికి తెగబడి, ఆపై హత్య చేసిన వ్యక్తికి ప్రత్యేక పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. విచారణ ప్రారంభించిన 29 రోజుల్లో నే నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు.. మరణశిక్ష విధించి రికార్డు సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని కవి నగర్ ప్రాంతంలో గతేడాది అక్టోబరు 19న రోడ్డు పక్కన రెండున్నరేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టంలో దారుణ విషయం బయటపడింది. ఆమెపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా చంపేసినట్టు వెల్లడైంది.


ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ను కుదిపేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక తండ్రి స్నేహితుడైన చందన్‌ను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. డిసెంబరు 29న చార్జిషీటు సమర్పించారు. కేసును విచారించిన న్యాయమూర్తి మహేంద్ర శ్రీవాస్తవ ఆధ్వర్యంలోని స్పెషల్ పోక్సో బెంచ్ నిందితుడు చందన్‌ను దోషిగా తేల్చి గురువారం మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.  

Updated Date - 2021-01-22T00:31:51+05:30 IST