పొదలకూరు పంచాయతీ బస్టాండ్‌లో ఆక్రమణలు తొలగేనా?

ABN , First Publish Date - 2021-10-25T04:38:04+05:30 IST

ఆరు మండలాలకు కూడలిగా ఉన్న పొదలకూరు పంచాయతీ బస్టాండ్‌లో పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పొదలకూరు పంచాయతీ బస్టాండ్‌లో ఆక్రమణలు తొలగేనా?

పొదలకూరు, అక్టోబరు 24 : ఆరు మండలాలకు కూడలిగా ఉన్న పొదలకూరు పంచాయతీ బస్టాండ్‌లో పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూ డు వైపులా నుంచి బస్టాండ్‌లోకి ఆక్రమణలు రోజురోజుకి చొచ్చుకొస్తున్నాయి. బస్టాండ్‌ కోసం వేసి న సిమెంటు రోడ్డుపైకి కూరగాయల అంగళ్లు, పూల అంగళ్లు, తోపుడు బండ్లు వచ్చాయి. అలాగే సంగం బస్సులు ఆగేచోట ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి.దీంతో బస్సులు తిరగాలన్నా.. ప్రయాణి కులు నిల్చోవాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గమనించిన పంచాయతీ అధికారులు, పాల క వర్గం శుక్రవారం వరకు గడువిచ్చి స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని వ్యాపారులకు సూచించారు. కొందరు మాత్రం స్వచ్ఛందంగా ఆక్రమణలు వదిలి వాళ్ల హద్దులోకి అంగళ్లు మార్చుకున్నారు.  మరికొందరు పంచాయతీ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసి కూరగాయల అంగళ్లను అలాగే ఉంచారు. దీంతో పూర్తిస్థాయిలో బస్టాండులో ఆక్రమణలు తొలగలేదు. ఆక్రమ ణలు పూర్తిగా తొలగితే కానీ ప్రయాణికుల ఇక్కట్లు తప్పవు. మరి పంచాయతీ పాలకవర్గం ఆక్రమ ణల తొలగింపులో ఎలా సఫలమవుతుందో వేచి చూడాలి. 

Updated Date - 2021-10-25T04:38:04+05:30 IST