పోడు రైతులు సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలి

Sep 15 2021 @ 00:32AM
భీమ్‌గల్‌ రైతు సదస్సులో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ కోదండరాం

టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం 

భీమ్‌గల్‌, సెప్టెంబరు 14: పోడు రైతులు సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని.. అప్పుడే ప్రభుత్వం దిగివచ్చి అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తుందని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. మంగళవా రం భీమ్‌గల్‌ మండల కేంద్రంలో సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ, అఖిల భా రత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సుకు కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అటవీ ప్రాం తాల్లో ఉన్న గిరిజనులు పోడు భూములను సాగు చేసుకొని జీవిస్తున్నార ని, అలాంటి వారి కోసమే అప్పటి ప్రభుత్వం 2006 అటవీ హక్కుల చట్టా న్ని తీసుకువచ్చిందని.. కానీ, ఆ చట్టం అమలు విషయంలో ప్రస్తుత ప్రభు త్వం వెనుకంజ వేస్తోందని అన్నారు. పోడు చేసుకున్న భూములను గిరిజ నులకు పట్టాచేసి ఇవ్వాల్సిందిపోగా పోలీసులు, అటవీ శాఖ అధికారులతో దాడులు చేయిస్తూ.. హరితహారం మొక్కలు నాటించడం ఎంత వరకు స బబని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అటవీ పరిరక్షణతో పాటే అటవీ హక్కులను కూడా పాటించాలన్నారు. ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తే రై తుల నుంచి ఎదురుదాడులు తప్పవన్నారు.  పోడు రైతుల హక్కుల కోసం ఈనెల 22న హైదరాబాద్‌లో ధర్నా ఉందని, అదే విధంగా 27వ తేదీన బం ద్‌కు పిలుపునివ్వడం జరిగిందని, ఇట్టి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఇందులో భాగంగానే అక్టోబర్‌ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పోడు సమస్య ఉన్న ప్రాంతాల్లో రోడ్ల దిగ్బంధం, రాస్తారోకో నిర్వహించడం జరు గుతుందని, ఈ నిరసన కార్యక్రమాల్లో పోడు రైతులు పాల్గొని విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చి రైతులను ఇబ్బం దులకు గురి చేస్తోందని అన్నారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని ప్రభు త్వం అమలు చేయాలని, పోడు భూములను చట్టబద్ధంగా పట్టా చేసి ఇ వ్వాలని, సాగుదారులందరికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనం తరం నందిగల్లీ నుంచి పోడు రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి భీమ్‌గల్‌ తహ సీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవ రాం, జిల్లా ప్రధానకార్యదర్శి రామకృష్ణ, ఎస్‌.సురేష్‌, కె.రాజేశ్వర్‌, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు గోదావరి నడ్పన్న, బాగ్య, సత్తెక్క, బి.బాబన్న, దామోద ర్‌, నరేందర్‌, రమేష్‌, కొండ గంగాధర్‌, ఎర్రన్న, కిషన్‌తో పాల్గొన్నారు. 

Follow Us on: