పోడు.. గోడు!

ABN , First Publish Date - 2022-05-21T05:32:42+05:30 IST

అర్హులైన పోడు రైతులకు హక్కు పత్రాలను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆశపడి దరఖాస్తులు చేసుకున్న పోడు రైతులకు నిరాశనే మిగిలింది.

పోడు.. గోడు!
రైతులు సాగు చేస్తున్న పోడు భూములు

ఏడు నెలలుగా దరఖాస్తుదారుల ఎదురు చూపులు

సమీపిస్తున్న వానాకాలం సీజన్‌.. ఊసెత్తని ప్రభుత్వం 

పరిష్కారం చూపాలంటూ అధికారుల పై ఒత్తిళ్లు

అనుమానంగానే కనిపిస్తున్న పోడు హక్కు పత్రాల జారీ

మొదలైన అటవీ అధికారుల అడ్డగింతలు  

అయోమయంలో అన్నదాతలు

ఆదిలాబాద్‌, మే20 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన పోడు రైతులకు హక్కు పత్రాలను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆశపడి దరఖాస్తులు చేసుకున్న పోడు రైతులకు నిరాశనే మిగిలింది. గత ఏడు మాసాల క్రితమే దరఖాస్తులు చేసుకున్న ప్రభుత్వానికి మాత్రం పట్టింపు కరువవుతోంది. జిల్లాలో 2021నవంబరు 8 నుంచి డిసెంబరు 16 వరకు పోడు దరఖాస్తులను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పరిశీలన చేపట్టి హక్కు పత్రాలను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన ఆచరణ సాధ్యం కావడం లేదు. ఇప్పటి వరకు అడుగు ముందుకు పడక పోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 16,661 మంది రైతులు పోడు భూములకు హ క్కు పత్రాలను ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇం దులో గిరిజన రైతులు 9847 మంది, 37,798.30 ఎకరాలకు దరఖాస్తు చేసుకోగా ఇతరులు అంటే ఎస్సీ, బీసీ, మై నార్టీలు 6814 మంది రైతులు, 24,467.16 ఎకరాల పోడు భూమి విస్తీర్ణానికి గాను దరఖాస్తు చేసుకున్నారు. మొ త్తం జిల్లా వ్యాప్తంగా 62,266.6 ఎకరాల పోడు భూమికి సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. అయితే నెలలు గడుస్తున్న ప్రభుత్వం పోడు దరఖాస్తుల ఊసెత్తక పోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. మరో పక్షం రోజుల్లో వానాకాల సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో పోడుభూముల్లో సాగు పనులకు రైతులు సిద్ధమవుతున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదంటూ అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. గత రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలోని పోడురైతులు హక్కు పత్రాలను ఇవ్వాలంటూ ఉట్నూ ర్‌ ఐటీడీఏ ముందు ఆందోళన చేపడుతున్న అధికారులు మాత్రం స్పష్టత ఇవ్వలేక పోతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఏం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. 

కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు..

2006 అటవి హక్కుల చట్టంపై ఏ మాత్రం అవగాహన లేని పోడు రైతులు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు చేసుకున్నారు. చట్ట ప్రకారం పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకే హక్కు కల్పించాలి. కానీ అవగాహన కల్పించక పోవడంతో గిరిజన రైతులతో పాటు గిరిజనేతర రైతులు కూడా దరఖాస్తులు చేసుకోవడం గందరగోళ పరిస్థితులకు దారి తీస్తోంది. అయితే గిరిజనేతర రైతులు దరఖాస్తు చేసుకున్న 2005 డిసెంబరు 13 లోపు 75 ఏళ్ల ముందు పోడు భూమిని సాగు చేస్తున్నట్లు ఆధారాలు చూ పాల్సి ఉంటుంది. అంటే 1930 సంవత్సరం నుంచి గిరిజనేతరులు పోడు భూమిని సాగుచేసుకుంటేనే వారికి హక్కులు దక్కే అ వకాశం ఉంటుంది. కానీ ఇది సాధ్యమయ్యే పనిగా కనిపించడం లేదు. ఎందుకంటే అప్పటి ఆధారాలు ఇప్పటి వరకు ఉండవన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కావాలనే ప్రభుత్వం కొర్రీలు పెట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతకాంగ్రెస్‌ ప్రభుత్వం హక్కు పత్రాలను పంపిణీ చేసిన సమయంలోనూ గిరిజనేతర రైతులెవరికీ హక్కుపత్రాలను ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వేల సంఖ్యలో గిరిజనేతర రైతులే పోడుభూములకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వారిని కాదని గిరిజనులకు హక్కు పత్రాలు ఇస్తే వ్యతిరేకత వస్తుందేమోనన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలు స్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయపరమైన ఆటంకాలు కూడా వచ్చే అవకాశాలు లేక పోలేదంటున్నారు. 

దరఖాస్తులతోనే సరిపెట్టారు..

ఎంతో హడావుడి, ఆర్భాటంతో పోడు రైతుల నుంచి అ ధికారులు దరఖాస్తులను స్వీకరించిన హక్కుపత్రాల జా రీలో మాత్రం జాప్యం జరుగుతునే ఉంది. నెలల తరబడి ఎదురు చూస్తున్న దరఖాస్తులతోనే సరిపెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో ఊహించని విధంగా ద రఖాస్తులు రావడంతో అసలైన రైతులకు హక్కుపత్రాలు వస్తాయోరావోనన్న అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. అటవీ భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతిని కూ డా తీసుకోవాల్సి ఉంటుం ది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం హ క్కు పత్రాలు ఇచ్చేం దుకు ఒప్పుకుంటుందా లేదా అనే సందేహాలే వినిపిస్తున్నాయి. జిల్లాలో గిరిజన రైతులు 9847 మంది కాగా గిరిజనేతర రైతులు 6814 మంది దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. దీంతో అంఛనాల కు మించిన దరఖాస్తులు రావడంతో అటవీ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ కారణంగానే హక్కుపత్రాల జారీలో ఆలస్యం జరుగుతుందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల ద్వారా అనర్హులను ఏరివేస్తే ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పట్లో పో డు భూములకు హక్కుపత్రాలను జారీ చేయడం అనుమానంగానే కనిపిస్తుందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. రైతులు మాత్రం మునుపటి మాదిరిగానే య థావిధిగా పొడు భూముల్లో పంటలను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారు లు అడ్డుకునే ప్రయత్నంచేస్తున్నారు.దీంతో రైతులు, రైతు సంఘాల నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. 

అంతా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే..

- రాజశేఖర్‌ (డీఎఫ్‌వో, ఆదిలాబాద్‌)

ఇప్పటికే పోడు భూములకు హక్కు పత్రాలను ఇచ్చేందుకు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులను తీసుకున్నాం. అంతా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తదుపరి ఎలాంటి ఆదేశాలు అందలేదు. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్హులైన రైతులను గుర్తిస్తాం. జిల్లాలో వచ్చిన దరఖాస్తుల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. రైతులు అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్న ప్రభుత్వ ఆదేశాలు లేనిదే హక్కు పత్రాలను అందించే అవకాశం ఉండదు. 

Updated Date - 2022-05-21T05:32:42+05:30 IST