అది ప్రజలకు తెలుసు: PK విమర్శలపై Nitish కౌంటర్

ABN , First Publish Date - 2022-05-07T02:11:02+05:30 IST

సొంత రాష్ట్రం బిహార్‌లో మార్పు కోసం భావసారూప్యత గల వ్యక్తులతో ‘జనసురాజ్‌’ అనే వేదికను ఏర్పాటు చేయనున్నట్టు గురువారం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు వచ్చిన..

అది ప్రజలకు తెలుసు: PK విమర్శలపై Nitish కౌంటర్

పాట్నా: గత 30 ఏళ్లుగా  Lalu Prasad Yadav, Nitish Kumar ఏలుబడిలో Bihar పేద రాష్ట్రంగా మారిందంటూ ఎన్నికల వ్యూహకర్త Prashant Kishor చేసిన వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా తాను ఏం చేశానో ప్రజలకు తెలుసని, ప్రజలు కాకుండా ఇంకెవరి నుంచి తమకు certificate అవసరం లేదని నితీశ్ అన్నారు. ఈ విషయమై శుక్రవారం నితీశ్ స్పందిస్తూ ‘‘బిహార్‌లో ఇంత కాలం మేము ఏం చేశామో ప్రజలకు తెలుసు. వేరొకరి అభిప్రాయాలు అవసరం లేదు. వాస్తవం ఇక్కడ చాలా అవసరం. ప్రజల కోసం మేము చాలా చేశాం. వాస్తవం ఇదే. ఏం చేశాం, ఎంత వరకు చేశామనేది బిహార్ మొత్తానికి తెలుసు’’ అని నితీశ్ అన్నారు.


కాగా, సొంత రాష్ట్రం బిహార్‌లో మార్పు కోసం భావసారూప్యత గల వ్యక్తులతో ‘జనసురాజ్‌’ అనే వేదికను ఏర్పాటు చేయనున్నట్టు గురువారం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ప్రశాంత్ కిశోర్  ప్రకటించారు. రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు వచ్చిన ఊహాగాణాలను కొంత వరకు నిజం చేస్తూనే ఇప్పుడప్పుడే లేదని సమాధానం ఇచ్చారు. తన రాజకీయ ప్రస్థానం గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. Mahatma Gandhi జయంతి పురస్కరించుకుని October 2న బిహార్ నుంచి Padyatra ప్రారంభించనున్నట్లు పీకే పేర్కొన్నారు.

Read more