అన్ని కులాల, మతాల ప్రజలు సంతోషంగా ఉన్నారు: యోగి

ABN , First Publish Date - 2021-10-23T22:28:14+05:30 IST

ప్రభుత్వం ఎవరినీ పక్షపాతంతో చూడలేదు. రాష్ట్ర ప్రజలందరి బాగోగులను పట్టించుకున్నాం. అందుకే నాలుగున్నరేళ్ల మా పాలనలో అన్ని కులాల, మతాల, భాషల, ప్రాంతాల, వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. సంతోషంగా, ప్రశాంతమైన వాతావరణంలో తమ పండుగలు నిర్వహించుకున్నారు. మా పాలనకు ఇదే గీటురాయి..

అన్ని కులాల, మతాల ప్రజలు సంతోషంగా ఉన్నారు: యోగి

లఖ్‌నవూ: నాలుగున్నరేళ్ల భారతీయ జనతా పార్టీ ఏలుబడిలో ఉత్తరప్రదేశ్‌లోని అన్ని కులాల, మతాల, విశ్వాసాలు ఉన్న ప్రజలు సంతోషంగా, ప్రశాంతమైన వాతావరణంలో తమ పండుగలు నిర్వహించుకుంటూ సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలన గురించి చెప్పుకొచ్చారు.


‘‘ప్రభుత్వం ఎవరినీ పక్షపాతంతో చూడలేదు. రాష్ట్ర ప్రజలందరి బాగోగులను పట్టించుకున్నాం. అందుకే నాలుగున్నరేళ్ల మా పాలనలో అన్ని కులాల, మతాల, భాషల, ప్రాంతాల, వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. సంతోషంగా, ప్రశాంతమైన వాతావరణంలో తమ పండుగలు నిర్వహించుకున్నారు. మా పాలనకు ఇదే గీటురాయి. కొన్నిసార్లు చిన్న చిన్న కట్టుబాట్లు తప్పలేదు. హోలి, దిపావళి, రామ నవమి, జన్మాష్టమి పండుగల సందర్భాల్లో కర్ఫ్యూ విధించాం’’ అని యోగి అన్నారు.

Updated Date - 2021-10-23T22:28:14+05:30 IST