కళాకారులను సన్మానిస్తున్న శుభప్రద్‌పటేల్, జడ్పీ వైస్‌చైర్మన్ విజయ్‌కుమార్
తాండూరు రూ రల్, మార్చి 27 : తాండూరులో కవయిత్రి మొల్ల కళావేదిక ఆధ్వర్యాన మొల్ల సాహిత్య అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథితులుగా విచ్చేసిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్‌పటేల్, జడ్పీ వైస్‌చైర్మన్ బైండ్ల విజయ్‌కుమార్ చేతులమీదుగా అవార్డులు అందజేశారు. మొల్ల జీవితంపై పరిశోధనలు జరగాలని వారు ఆకాంక్షించారు. జానపద వీరులు పండుగల సాయన్న, మీరా సాహెబ్ జీవితాలపై పాఠ్యాంశాలు వచ్చే విధంగా ప్రభుత్వానికి విన్నవిస్తామని అన్నారు. మునిసిపల్ చైౖర్‌పర్సన్ స్వప్నపరిమళ్, రచయిత గోగు శ్యామల, నాంపల్లి సుజాత, కవయిత్రి మొల్ల కళావేదిక అధ్యక్షులు వెంకట్, ప్రధాన కార్యదర్శి వెంకట్ వంశరాజ్, జానపద కళాకారుల పరిశోధకులు దాసరి రంగా, డ్యాన్స్ మాస్టర్ అశోక్, తదితరులున్నారు. అదేవిధంగా చెంగోల్ గ్రామానికి శుభప్రద్‌పటేల్ మొదటిసారి వెళ్లడంతో తాండూరు మండల జడ్పీటీసీ గౌడి మంజుల సన్మానం చేశారు.