వ్యాపారులు వెచ్చించిన ధరకే..

ABN , First Publish Date - 2021-04-24T04:11:15+05:30 IST

జిల్లాలోని డీసీపల్లి వేలం కేంద్రంలో శుక్రవారం పొగాకు వేలం కొనసాగింది. ఈ తరుణంలో గిట్టుబాటు ధరలు లేక రెండురోజుల పాటు వేలాన్ని నిలిపేసిన

వ్యాపారులు వెచ్చించిన ధరకే..

 కొనసాగిన పొగాకు వేలం

మర్రిపాడు, ఏప్రిల్‌ 23: జిల్లాలోని డీసీపల్లి వేలం కేంద్రంలో శుక్రవారం పొగాకు వేలం కొనసాగింది. ఈ తరుణంలో గిట్టుబాటు ధరలు లేక రెండురోజుల పాటు వేలాన్ని నిలిపేసిన రైతులు చివరికి వ్యాపారులు వెచ్చించిన ధరలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ రోజులు వేలం కేంద్రంలో పొగాకు ఉంచితే నాణ్యత కోల్పోతుందన్న కార ణంతో  అమ్ముతున్నారు. కాగా శుక్రవారం రైతులు 265 పొగాకు బేళ్లను తీసుకు రాగా వాటిలో 218 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. వివిధ కారణాల వల్ల 47 బేళ్లు వెనుతిరిగినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్‌ తెలిపారు. నోబిడ్‌- 36, సీఆర్‌-8, ఆర్‌ఆర్‌-3గా పరిగణించ బడ్డాయి. వేలంలో 8 కంపెనీల వ్యాపారులు పాల్గొన్నారు. కిలో గరిష్ఠ ధర రూ.180, కనిష్ఠ ధర రూ.100, సగటు ధర రూ.148.30లుగా నమోదైంది.

Updated Date - 2021-04-24T04:11:15+05:30 IST