పొగాకు రైతులు సరైన పద్ధతిలో సాగు చేయాలి

ABN , First Publish Date - 2021-01-22T05:48:51+05:30 IST

పొగాకు రైతులు సరైన పద్ధతిలో సాగు చేయాలని టుబాకో బోర్డు ఈడీ ఎ.శ్రీధర్‌బాబు సూచించారు. మండల పరిధిలోని మాచవరం, భూతం వారిపల్లి గ్రామాల్లో పొగాకు పంటలను గురువారం ఆయన పరిశీలించారు.

పొగాకు రైతులు సరైన పద్ధతిలో సాగు చేయాలి
కంభాలపాడులో పంట పరిశీలిస్తున్న ఈడీ శ్రీధర్‌బాబు


బోర్డు ఈడీ శ్రీధర్‌

కనిగిరి, జనవరి 21 : పొగాకు రైతులు సరైన పద్ధతిలో సాగు చేయాలని  టుబాకో బోర్డు ఈడీ ఎ.శ్రీధర్‌బాబు సూచించారు. మండల పరిధిలోని మాచవరం, భూతం వారిపల్లి గ్రామాల్లో పొగాకు పంటలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సం దర్భంగా రైతులతో సమావేశమై దిగుబడి అయిన పొగాకును పరిశీలించి వివిధ సూచ నలు చేశారు. పొగాకు తోటలను, బ్యారన్‌ ల ను పరిశీలించారు. విత్తన యాజమాన్య పద్ధ తులను పాటించి అధిక దిగుబడులు సాధిం చాలని సూచించారు. క్యూరింగ్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన క ల్పించారు. పక్వానికి వచ్చిన ఆకులను సక్ర మ పద్ధతిలో కూర్చి ఆకు రాలిపోకుండా జా గ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయ నతో పాటు టుబాకో బోర్డు ఏవో కేఎం  శ్రీని వాసరావు, ఆర్‌ఎం ఎస్‌ఎల్‌ఎస్‌ ఒంగోలు  వేణుగోపాల్‌, టుబాకో బోర్డు వైస్‌ చైర్మన్‌ కొండారెడ్డి, ఫీల్డ్‌ ఆఫీసర్‌ చిన్నపాములు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ షషీమా, రైతులు పా ల్గొన్నారు. 

పొదిలిలో..

పొదిలి రూరల్‌ : పొగాకు రైతులు క్యూరింగ్‌లో జాగ్రత్తలు పాటించాలని బోర్డు ఎగ్జిక్యూటి వ్‌ డైరెక్టర్‌ ఎ.శ్రీధర్‌బా బు అన్నారు. బుధవారం పొదిలి వేలం కేంద్రం పరిధిలోని కంభాలపాడు, పెదారికట్ల, అగ్రహారం గ్రామాల్లో పంటపొలాలను పరిశీలించారు. అనంతరం క్యూరింగ్‌, గ్రేడింగ్‌, మండెలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆకు కొట్టిన తరువాత క్యూరింగ్‌ చేసేటప్పుడు  తేమశాతం లేదని నిర్ధారించిన తరువాతనే బ్యారన్‌లో నుంచి కొట్టు దించాలన్నారు. గ్రేడింగ్‌ చేసేటప్పుడు, మండె వేసేటప్పుడు తడిలేకుండా చూసుకోవాలన్నారు. చెక్కులు తొక్కే సమయంలో కొంతమంది రైతులు స్ర్పే చేయకుండా చె క్కు ఏర్పాటు చేయాలన్నారు. అలా చేస్తేనే మంచి ధర రావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ ఏడాది మంచిధరతో పాటు వే లం కేంద్రాన్ని త్వరగా ప్రారంభించాలని రైతులు కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఫిబ్రవరి మెదటి వారంలోనే కొనుగోలు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామ ని రైతులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట బోర్డు వైస్‌చైర్మన్‌ కొండారెడ్డి, ఎస్‌ఎల్‌ఎస్‌ రీజినల్‌ మేనేజర్‌ వేణుగోపాల్‌, కందుకూరు, కనిగిరి, పొదిలి వేలం నిర్వహణాధికారులు శ్రీలక్ష్మణరావు, శ్రీనివాసరావు, శ్రీ రవికాంత్‌ క్షేత్రస్థాయి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-22T05:48:51+05:30 IST