పోహా

ABN , First Publish Date - 2021-08-14T18:09:11+05:30 IST

క్యాలీఫ్లవర్‌ ముక్కలు - ఒక కప్పు, క్యాలీఫ్లవర్‌ స్టాక్‌ - అరకప్పు (క్యాలీఫ్లవర్‌ కాడభాగాన్ని ముక్కలుగా కట్‌ చేసి నీళ్లు పోసి ఉడికించి స్టాక్‌ తయారుచేసుకోవాలి), వేరుశనగలు - పావుకప్పు, ఉల్లిపాయ - ఒకటి, కరివేపాకు - కొద్దిగా, కొత్తిమీర

పోహా

కావలసినవి: క్యాలీఫ్లవర్‌ ముక్కలు - ఒక కప్పు, క్యాలీఫ్లవర్‌ స్టాక్‌ - అరకప్పు (క్యాలీఫ్లవర్‌ కాడభాగాన్ని ముక్కలుగా కట్‌ చేసి నీళ్లు పోసి ఉడికించి స్టాక్‌ తయారుచేసుకోవాలి), వేరుశనగలు - పావుకప్పు, ఉల్లిపాయ - ఒకటి, కరివేపాకు - కొద్దిగా, కొత్తిమీర - ఒకకట్ట, ఆవాలు - అర టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, పసుపు - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నెయ్యి - ఒక టీస్పూన్‌, నిమ్మరసం - అర టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, పచ్చిమిర్చి - ఒకటి.


తయారీ విధానం: వేరుశనగలు వేగించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడి అయ్యాక ఇంగువ, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేగించుకోవాలి. పసుపు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. వేగించి పెట్టుకున్న వేరుశనగలు, క్యాలీఫ్లవర్‌ ముక్కలు వేసి కలపాలి. రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు, క్యాలీఫ్లవర్‌ స్టాక్‌ పోసి ఉడికించాలి. క్యాలీఫ్లవర్‌లు మెత్తగా ఉడికిన తరువాత నిమ్మరసం పిండుకుని, కొత్తిమీర వేసి సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-08-14T18:09:11+05:30 IST