పోహా క్రోకెట్స్‌

ABN , First Publish Date - 2020-12-19T17:09:45+05:30 IST

అటుకులు - ఒక కప్పు, బంగాళదుంప - ఒకటి, జున్ను - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - రెండు టీస్పూన్లు, జాజికాయ పొడి - పావు టీస్పూన్‌, మొజరెల్లా ఛీజ్‌ - ఒకటిన్నర స్టిక్‌, పిండి - పావు కప్పు, బ్రెడ్‌ క్రంబ్స్

పోహా క్రోకెట్స్‌

కావలసినవి: అటుకులు - ఒక కప్పు, బంగాళదుంప - ఒకటి, జున్ను - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - రెండు టీస్పూన్లు, జాజికాయ పొడి - పావు టీస్పూన్‌, మొజరెల్లా ఛీజ్‌ - ఒకటిన్నర స్టిక్‌, పిండి - పావు కప్పు, బ్రెడ్‌ క్రంబ్స్‌ - కొద్దిగా, నూనె - సరిపడా.


తయారీ విధానం: బంగాళదుంపను శుభ్రంగా కడిగి మధ్యలో కట్‌ చేసుకొని ఉడికించాలి. తరువాత పొట్టు తీసి గుజ్జుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అటుకులను గోరు వెచ్చని నీటిలో కడిగి పది నిమిషాలు నానబెట్టాలి. తరువాత నీళ్లు లేకుండా అటుకులు చేత్తో పిండి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో బంగాళదుంప గుజ్జు తీసుకుని అందులో అటుకులు, జున్యు, మిరియాల పొడి, జాజికాయ పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. మొజరెల్లా ఛీజ్‌ని ముక్కలుగా కట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక పాత్రలో పిండి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి పలుచటి పేస్టులా తయారు చేసుకోవాలి. ఒక ప్లేట్‌లో బ్రెడ్‌ క్రంబ్స్‌ తీసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప, అటుకుల మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని చిన్న బాల్‌లా చేసుకోవాలి. తరువాత మధ్యలో కాస్త వేలితో ఒత్తి, అందులో ఛీజ్‌ ముక్కను పెట్టి మళ్లీ బంతిలా చేసుకోవాలి. వీటిని పలుచగా తయారుచేసి పెట్టుకున్న పిండిలో తడిపి, బ్రెడ్‌ క్రంబ్స్‌ అంటించాలి. స్టవ్‌ పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక వేసి వేగించాలి. కెచప్‌తో తింటే ఇవి టేస్టీగా ఉంటాయి.


Updated Date - 2020-12-19T17:09:45+05:30 IST