పోహా కట్‌లెట్‌

ABN , First Publish Date - 2022-02-03T19:23:56+05:30 IST

మందం అటుకులు- కప్పు, ఆలుగడ్డ- పెద్దది ఒకటి, క్యారెట్‌- ఒకటి, బీన్స్‌- అయిదు, ఉల్లిగడ్డ- ఒకటి, కొత్తిమీర తరుగు- స్పూను

పోహా కట్‌లెట్‌

కావలసిన పదార్థాలు: మందం అటుకులు- కప్పు, ఆలుగడ్డ- పెద్దది ఒకటి, క్యారెట్‌- ఒకటి, బీన్స్‌- అయిదు, ఉల్లిగడ్డ- ఒకటి, కొత్తిమీర తరుగు- స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు- అర స్పూను, పసుపు- పావు స్పూను, కారం- పావు స్పూను, గరం మసాలా పౌడర్‌- పావు స్పూను, నువ్వులు- స్పూను, నూనె, నీళ్లు, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: ఆలుగడ్డను ఉడికించి మెత్తగా చేసి పెట్టుకోవాలి. మిగతా కూరగాయల్ని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. అటుకుల్ని నీళ్లలో నాలుగు నిమిషాలు నానబెట్టిన తరవాత వడగట్టి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో కూరగాయల ముక్కలన్నిటినీ తీసుకోవాలి. దీంట్లో అటుకులు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, నువ్వులు, కొత్తిమీర తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి బాగా కలిపి చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. అవసరమైతే కాస్త నీటిని జతచేయవచ్చు. బాణలిలో కాస్త నూనె వేసి ఒక్కో ముద్దని అటూ ఇటూ దోరగా కాలిస్తే పోహా కట్‌లెట్‌ రెడీ. 

Updated Date - 2022-02-03T19:23:56+05:30 IST