పోహా నగెట్స్‌

ABN , First Publish Date - 2020-06-13T16:26:44+05:30 IST

అటుకులు - ఒకకప్పు, బంగాళదుంప - ఒకటి, బియ్యప్పిండి - రెండు స్పూన్లు, కారం - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె -

పోహా నగెట్స్‌

కావలసినవి: అటుకులు - ఒకకప్పు, బంగాళదుంప - ఒకటి, బియ్యప్పిండి - రెండు స్పూన్లు, కారం - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, ఎండుమిర్చి - రెండు, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌. 


తయారీ: పాత్రలో ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. ఈ అటుకులను శుభ్రంగా కడగాలి. తరువాత అటుకుల్లో కొద్దిగా నీళ్లు పోసి కాసేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు మెత్తగా అయిన అటుకుల్లో మిగిలిన నీళ్లను జాలి సహాయంతో వడబోసి తీసేయాలి. ఉడికించిన బంగాళదుంపను మెత్తగా చిదిమి అందులో వేయాలి. తరువాత అందులో బియ్యప్పిండి, ఉప్పు, కారం, చిల్లీ ఫ్లేక్స్‌, ధనియాల పొడి వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి. తరువాత మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ నగెట్స్‌లా చేసుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక అటుకుల నగ్గెట్స్‌ వేసి వేగించాలి. వీటిని చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2020-06-13T16:26:44+05:30 IST