పాతాళంలో విషం..!

ABN , First Publish Date - 2021-12-08T06:14:56+05:30 IST

జిల్లాలోని పలుచోట్ల భూగర్భ జలం విషపూరితమవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా పలు ప్రా జెక్ట్‌ల పరిధిలోని భూగర్భ జలాలు కాలకూట విషంలా మారుతున్నాయ న్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలాల కోసం అధిక మోతా దు లో ఎరువులు, రసాయనిక మందులను వినియోగిస్తున్న కారణం గా భూగర్భమంతా విషపూరితమవుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌ బేసిన్‌ భూగర్భ జలాలు విషపూరితమవుతున్నట్లు నిర్ధారణ అవుతోంది.

పాతాళంలో విషం..!
పెంబి మండలంలోని వ్యవసాయ క్షేత్రాల్లోని బోర్ల నుంచి వచ్చే నీటిని పరిశీలిస్తున్న అధికారులు

విషపూరితమవుతున్న కడెం బేసిన్‌ నీరు  

సాగు, తాగు ఉపయోగంపై తీవ్ర ప్రభావం 

ఆందోళన రేకెత్తిస్తున్న భూగర్భ జల శాఖ నివేదిక  

హద్దుమీరిన ఫ్లోరైడ్‌ నైట్రేట్‌ల తీవ్రత  

నిర్ధారించిన క్వాలిటీ ల్యాబ్‌


నిర్మల్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలుచోట్ల భూగర్భ జలం విషపూరితమవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా పలు ప్రా జెక్ట్‌ల పరిధిలోని భూగర్భ జలాలు కాలకూట విషంలా మారుతున్నాయ న్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలాల కోసం అధిక మోతా దు లో ఎరువులు, రసాయనిక మందులను వినియోగిస్తున్న కారణం గా భూగర్భమంతా విషపూరితమవుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌ బేసిన్‌ భూగర్భ జలాలు విషపూరితమవుతున్నట్లు నిర్ధారణ అవుతోంది. 

కడెం ప్రాజెక్ట్‌ పరిధిలో రెండు బేసిన్‌లు..

కడెం ప్రాజెక్ట్‌ పరిధిలో రెండు బేసిన్‌లుండగా ఇందులోని ఎగువ బేసి న్‌ ప్రాంతమంతా ఫ్లోరైడ్‌ నైట్రేట్స్‌ వంటి క్షారకాలతో నిండిపోయిందని పలువురు అంటున్నారు. ఇటీవల భూగర్భ జలశాఖ అధికారులు కడెం బేసిన్‌ పరిధిలో భూగర్భ జలాలపై చేసిన పరిశోధనలు ఈ అంశాన్ని వె ల్లడించాయి. భూగర్భ జలశాఖ పరిధిలోని అబ్జర్వేషన్స్‌ బావుల ద్వారా సే కరించిన నీటిని ఇటీవలే ఆ శాఖకు సంబంధించిన క్వాలిటీ ల్యాబ్‌కు పం పారు. ఈ ల్యాబ్‌లో కడెం బేసింగ్‌ భూగర్భ జలాలను పరిశీలించగా ఇక్క డి నీటి తీవ్రత వివరాలు వెల్లడయ్యాయి. 

98 గ్రామాలపై ప్రభావం..

కడెం బేసిన్‌ పరిధిలో కుడి, ఎడమ కాలువల కింద ప్ర స్తుతం 68,150 ఎకరాలు సాగవుతుండగా, మొత్తం 98 గ్రామాలు సాగు ప్రయోజనం పొందుతున్నాయి. ఈ బేసిన్‌ భూ గర్భ పరిధిలో ఫ్లోరైడ్స్‌, నైట్రేట్‌ ఎక్కువ శాతంతో ఉన్న కారణంగా ఈ గ్రామాల ప్రజలు అక్కడి బోరు బావుల నీటిని తాగడం శ్రేయస్కరం కాదంటున్నారు. మిషన్‌ భగీరథ నీటిని అలాగే శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలని భూగర్భ జల శాఖ అధికారులు సూచిస్తున్నారు. చాలా గ్రామాల్లో కుళాయి నీటితో పాటు బోరుబావుల నీటిని అలాగే ఇక్కడి కాలువల నీటిని ప్రజలు తమ తాగునీటి అ వసరాల కోసం వినియోగిస్తుంటారు. ఇప్పుడిప్పుడే మిషన్‌ భగీరథ నీరు కొన్ని గ్రామాలకే అందుతుండగా, మరికొన్ని గ్రామాలకు ఆ సౌకర్యం ఇప్పటి వరకు చేకూరలేదు. చేనుల్లో పని చేసే రైతులు ఎక్కువగా అక్కడి బోరుబావుల నీటినే తాగుతుంటారు. దీని కారణంగా క్రమంగా వారి ఆరోగ్యాలకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉ న్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నైట్రేట్స్‌ కడెం, పెద్దూర్‌, పెంబి, బుట్టాపూర్‌, చిన్నాపూర్‌, రేవోజిపేట్‌లలో ఫ్లోరైడ్‌ ఖానాపూర్‌ డౌన్‌జోన్‌లో గల మున్యాల్‌, చిన్నూర్‌, బెల్లాల్‌ ఆయకట్టు ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

76 శాతానికి చేరిన నైట్రేట్‌..

కడెం ప్రాజెక్ట్‌ పరిధిలో లెప్ట్‌ కెనాల్‌ కింద 66,400 ఎకరాలు, రైట్‌ కె నాల్‌ కింద 1700 ఎకరాలు సాగవుతోంది. మే, నవంబరు మాసాల్లో  నీ టి నమూనాలను సేకరించి ల్యాబ్‌లో పరిశీలించారు. మేలో ఇక్కడి భూ మి పొరల్లో నైట్రేట్‌ లీటరుకు 4.43 నుంచి 138.91 మిల్లీగ్రాము వరకు ఉ న్నట్లు నిర్ధారించారు. నవంబరులో 5.84 మిల్లీ గ్రాముల నుంచి 328.15 మిల్లీగ్రాముల వరకు ఉందని పరిశోధనల ద్వారా వెల్లడైంది. సాధారణం గా నీటిలో నైట్రేట్‌ శాతం 45శాతం వరకు ఉండాలి. ప్రస్తుతం దీని తీవ్రత 76 శాతం వరకు చేరుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.  

12 అబ్జర్వేషన్‌ బావుల షాంపిళ్ల సేకరణ..

కడెం కమాండ్‌ ఏరియా పరిధిలో ఉన్న 12 అబ్జర్వేషన్‌ బావుల ద్వారా సేకరించిన నీటిపై సంబంధిత అధికారులు పరిశోధనలు చేశారు. స్టడీ ఆఫ్‌ వాటర్‌ క్వాలిటీ ఫారా మీటర్‌ ఆన్‌ కడెం రిజర్వాయర్‌ పేరిట ఇక్కడి భూగర్భ జల శాఖ అధికారులు మే, నవంబరు నెలల్లో నీటిని సేకరించి ఆ నీటి షాంపిళ్లను హైదరాబాద్‌లోని క్వాలిటీ ల్యాబ్‌కు పంపారు. ఈ ల్యాబ్‌లో జరిపిన పరిశోధనల నివేదికలు అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మేలో నైట్రేట్‌ విలువలు గరిష్టం 138.91 మిల్లీగ్రాముల వర కు ఉన్నట్లుగా అలాగే నవంబరులో కనిష్టం 5.84 మిల్లీగ్రాముల నుంచి గరిష్టంగా 328.15 మిల్లీగ్రాములుగా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ పరిశోధన వివరాలను నిర్మల్‌లోని భూగర్భ    జల శాఖ అధికారులు ప్రభుత్వాని కి నివేదించి పరిస్థితి వివరించారు. 

మిషన్‌ భగీరథ నీరే శ్రేయస్కరమంటున్న అధికారులు.. 

కడెం కమాండ్‌ ఏరియా పరిధిలో విపరీతంగా రసాయనిక ఎరువు లు, క్రిమిసంహారక మందులను వాడుతున్న కారణంగా అక్కడి భూ ము ల లోపలి పొరలు క్రమంగా విషపూరితమవుతున్నట్లు అధికారులు నిర్ధారిస్తున్నారు. ఎరువులు, రసాయనల కారణంగా భూమిలో నైట్రేట్‌, ప్లోరైడ్‌ల శాతం క్రమంగా పెరిగిపోతున్నట్లు అధికారుల నివేదికలు వెల్లడిస్తున్నాయి. పొలాల్లో క్రమంగా ఇక్కడి భూగర్భ నీటిలో ప్లోరైడ్‌, నైట్రేట్‌ శా తం పెరిగిపోతుండడం అధికారులను ఆందోళనకు గురిచేయగా జనానికి ప్రాణసంకటంగా మారుతోంది. మిషన్‌ భగీరథ శుద్ధ జలాన్ని వినియోగించాలంటూ అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - 2021-12-08T06:14:56+05:30 IST