చేపల కుంటలో విషప్రయోగం ?

ABN , First Publish Date - 2022-08-18T04:56:47+05:30 IST

పర్చూరు మండల పరిఽధిలోని నాగులపాలెం శివారు కుంటలో పెంచుతున్న చేపలు చనిపోవటంపై బాధితుడు లబోదిబో మంటున్నాడు. పర్చూరు చెంచుల కాలనీకి చెందిన నల్లబోతుల శ్రీనివాసరావు నాగులపాలెం గ్రామానికి చెందిన ఓవ్యక్తి కుంటను లీజుకు తీసుకుని చేపలను పెంచుతున్నాడు. బుధవారం ఉదయం కుంటవద్దకు వెళ్లగా చేపలు చనిపోయి పైకి తేలటంతో ఆందోళనకు గురయ్యాడు.

చేపల కుంటలో విషప్రయోగం ?
చనిపోయి నీటిపై తేలియాడుతున్న చేపలు

లబోదిబో మంటున్న బాధితుడు

పోలీసులకు ఫిర్యాదు

నాగులపాలెం(పర్చూరు), ఆగస్టు 17: పర్చూరు మండల పరిఽధిలోని నాగులపాలెం శివారు కుంటలో పెంచుతున్న చేపలు చనిపోవటంపై బాధితుడు లబోదిబో మంటున్నాడు. పర్చూరు చెంచుల కాలనీకి చెందిన నల్లబోతుల శ్రీనివాసరావు నాగులపాలెం గ్రామానికి చెందిన ఓవ్యక్తి కుంటను లీజుకు తీసుకుని చేపలను పెంచుతున్నాడు. బుధవారం ఉదయం కుంటవద్దకు వెళ్లగా చేపలు చనిపోయి పైకి తేలటంతో ఆందోళనకు గురయ్యాడు. లక్షల రూపాయలు వెచ్చించి పెంచుకున్న చేపలు మృతి చెందటంతో బోరున విలపించాడు. గుర్తుతెలియని వ్యక్తులు విషప్రయోగం చేయటం వల్లే చేపలు చనిపోయాయని ఆరోపిస్తున్నాడు. అయితే రైతులు పొలం పనులకు సంబంధించిన క్రిమిసంహారాలు కుంటలో కలపటం వల్ల మృతి చెందాయా, లేక ఎవరైనా విషప్రయోగం చేశారా అన్న విషయం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. దీనిపై బాధితుడు శ్రీనివాసరావు పర్చూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2022-08-18T04:56:47+05:30 IST