పీవోకే భారత్‌లో అంతర్భాగం : రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2022-07-25T01:34:09+05:30 IST

పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK), కాశ్మీర్‌(Kashmir) భారత్‌లో (India) అంతర్భాగమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath singh) పునరుద్ఘాటించారు.

పీవోకే భారత్‌లో అంతర్భాగం  : రాజ్‌నాథ్

జమ్మూ : పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK), కాశ్మీర్‌(Kashmir) భారత్‌లో (India) అంతర్భాగమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath singh) పునరుద్ఘాటించారు. ఇక మీదట కూడా ఈ ప్రాంతాలు దేశంలో భాగంగానే కొనసాగుతాయని అన్నారు. ఈ మేరకు పార్లమెంటులో తీర్మానం పాసయ్యిందని ఆయన గుర్తుచేశారు. ‘ శివుని రూపంలో బాబా అమర్‌నాథ్ మనతో(ఇండియాలో) ఉంటే.. మాత శరదా శక్తి నియంత్రణరేఖకు(ఎల్ఏసీ) అవతల ఉండడం ఎలా సాధ్యం’ అని పేర్కొన్నారు. శారదా పీఠాన్ని ఉద్దేశిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవత సరస్వతికి (శరదా అని కూడా పిలుస్తారు) నిలయమైన దేవాలయం శిథిలాలపై ఈ పీఠాన్ని నిర్మించారు.


23వ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా జమ్మూలో నిర్వహించిన కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ప్రసంగించారు. ఇండియన్ ఆర్మీ సైనికుల ప్రాణ త్యాగాలను మననం చేసుకున్నారు. 1962తో పోల్చితే భారత్ ప్రస్తుతం ఎంతో శక్తివంతమైనదన్నారు. ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు.

Updated Date - 2022-07-25T01:34:09+05:30 IST