ఫంక్షన్ హాల్లో పేకాట.. పోలీసుల మెరుపు దాడి

ABN , First Publish Date - 2021-12-19T19:08:04+05:30 IST

తాడిపత్రి రూరల్ పరిధిలోని పద్మావతి ఫంక్షన్ హల్‌పై పోలీసుల మెరుపు దాడి చేశారు.

ఫంక్షన్ హాల్లో పేకాట.. పోలీసుల మెరుపు దాడి

అనంతపురం: తాడిపత్రి రూరల్ పరిధిలోని పద్మావతి ఫంక్షన్ హల్‌పై పోలీసుల మెరుపు దాడి చేశారు. ఓ పెళ్లిలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం తెలియడంతో పోలీసులు ఫంక్షన్ హల్‌పై దాడి చేశారు. పోలీసులు అకస్మాత్తుగా దాడి చేయడంతో  పేకాట ఆడుతున్న వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పైనుంచి దుకాడంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలయిన వ్యక్తిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-12-19T19:08:04+05:30 IST