పోలవరం గేట్ల అమరిక పూర్తి

ABN , First Publish Date - 2022-05-21T02:52:49+05:30 IST

లవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన స్పిల్‌ వే నిర్మాణం మిగిలిన హైడ్రాలిక్‌ సిలిండర్ల అమరిక శుక్రవారానికి పూర్తయిందని జలవనరులశాఖ

పోలవరం గేట్ల అమరిక పూర్తి

పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన స్పిల్‌ వే నిర్మాణం మిగిలిన హైడ్రాలిక్‌ సిలిండర్ల అమరిక శుక్రవారానికి పూర్తయిందని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. స్పిల్‌వేలో 48 రేడియల్‌ గేట్ల అమరిక, గేట్లను పైకి కిందకి కదిలించడానికి అవసరమయ్యే 96 హైడ్రాలిక్‌ సిలిండర్ల అమరిక వాటికి అవసరమయ్యే విద్యుత్‌ సరఫరా అందించే 24 పవర్‌ ప్యాక్‌ సెట్ల ఏర్పాటు నేటితో పూర్తయ్యింది. గోదావరి జలాలను స్పిల్‌వే గుండా బయటకు పంపించే క్రమంలో ఉపయోగించే రివర్‌ స్లూయిజ్‌ గేట్ల ఏర్పాటతోపాటు పది రివర్‌ స్లూయిజ్‌ గేట్లను ఎత్తి దించడానికి 20 హైడ్రాలిక్‌ సిలిండర్ల అమరిక వాటికి విద్యుత్‌ సరఫరా కోసం పది పవర్‌ప్యాక్‌ సెట్ల అమరిక పనులు పూర్తయ్యాయి. 

Updated Date - 2022-05-21T02:52:49+05:30 IST