పోలవరం నిర్వాసితులకు అన్యాయం జరగదు

ABN , First Publish Date - 2021-03-01T05:51:15+05:30 IST

పోలవరం నిర్వాసితులకు ఎటువంటి అన్యాయం జర గదని ప్రాజెక్టు అడ్మినిసే ్ట్రటర్‌, ఎక్స్‌అఫీషియో జాయింట్‌ కలెక్టర్‌ ఓ ఆనంద్‌ పేర్కొన్నారు.

పోలవరం నిర్వాసితులకు అన్యాయం జరగదు

  • ప్రాజెక్టు అడ్మినిసే్ట్రటర్‌, ఎక్స్‌ అఫీషియో జేసీ ఆనంద్‌

చింతూరు, ఫిబ్రవరి 28: పోలవరం నిర్వాసితులకు ఎటువంటి అన్యాయం జర గదని ప్రాజెక్టు అడ్మినిసే ్ట్రటర్‌, ఎక్స్‌అఫీషియో జాయింట్‌ కలెక్టర్‌ ఓ ఆనంద్‌ పేర్కొన్నారు. ఆదివారం చింతూరు ఐటీడీఏ ప్రాంగ ణంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎటపాక డివిజన పరిధి లోని 41.5 కాంటూరు లెవెల్లో ముంపునకు గురికానున్న 21 గ్రామాలకు పున రావాస చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో ముంద స్తుగా కొత్తూరు, మెట్టగూడెం, తుష్టివారిగూడెం గ్రామాలకు చెందిన 138 కుటుంబాలను మార్చి నెలఖారుకల్లా ఎటపాక మండలం, నర్సింగపేట, కాప వరం పునరావాస గ్రామాలకు తరలిస్తామన్నారు. నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం, పునరావాసం కల్పించాకే తరలిస్తామన్నారు. 151 రెవెన్యూ గ్రామాల కుగాను ఇప్పటికే 74 గ్రామాలకు భూపరిహారం చెల్లించామన్నారు.  గిరిజన నిర్వాసితులకు రూ.6.86 లక్షలు, గిరిజనేతరులకు రూ.6.36 లక్షల పరిహారం చెల్లించడంతో పాటు సీఎం హామీ మేరకు ఇతర చెల్లింపులు ఉండనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఎ.వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T05:51:15+05:30 IST