ఏజెన్సీ చట్టాలపై ఐటీడీఏ అధికారులకు పట్టు ఉండాలి...

ABN , First Publish Date - 2022-08-10T12:08:44+05:30 IST

బుట్టాయగూడెం మండలంలోని కెఆర్ పురం ఐటీడీఏలో మంగళవారం నాడు ఘనంగా జరిగిన అదివాసీ దినోత్సవం వేడుకలలో...

ఏజెన్సీ చట్టాలపై ఐటీడీఏ అధికారులకు పట్టు ఉండాలి...

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా):  ఏజెన్సీ చట్టాలపై ఐటీడీఏ అధికారులకు పట్టు ఉండాలని, వాటికి అనుగుణంగా వారు పని చెయ్యాలని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సూచించారు. బుట్టాయగూడెం మండలంలోని కెఆర్ పురం ఐటీడీఏలో మంగళవారం నాడు ఘనంగా జరిగిన అదివాసీ దినోత్సవం వేడుకలలో పాల్గొన్న బాలరాజు కోయ భాషలోనే మాట్లాడి ఆకట్టుకున్నారు. అంతకు ముందు ఆదివాసీ జెండా ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలు జరిగాయి. తరువాత అదివాసీ నాయకుల ఫోటోలకు పూలమాలలు వేసి కార్యక్రమం మొదలుపెట్టారు. తొలుత ప్రసంగించిన పలువురు అదివాసీ నాయకులు ఆదివాసీ చట్టాలపై ఆదివాసులందరికి అవగాహన ఉండాలంటూ కొన్ని చట్టాలను వివరించారు. 


ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని పిల్లలతో నృత్యం చేసి, ప్రజాప్రతినిధులందరినీ సత్కారించారు. ఐటీడీఏ పాఠశాలల్లో చదివి పదోతరగతిలో ప్రథమస్థానం పొందిన మొడియం పల్లవిని ఈ వేడుకల్లో భాగంగా సత్కరించి రూ.10 వేలు చెక్కు అందించారు. 


ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పిఒ శ్రీను కుమార్, పోలవరం డిఎస్‌పి లతాకుమారి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు జలగం రాంబాబు, తెల్లం రాములు, మొడియం గంగరాజు, పాయం పోసిరావు, కందుల ప్రకాష్, సోయం రామారావు, సోడెం రాజు, ఎయంఒ సిరమయ్య, డిడి, అదివాసీల జేఏసి నాయకులు మొడియం శ్రీను, కొవ్వాసి శ్రీను, కాకి మధు, కుర్సం దుర్గరావు తదితరులు పాల్గొన్నారు





Updated Date - 2022-08-10T12:08:44+05:30 IST