పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్‌ పథకం

ABN , First Publish Date - 2020-12-04T05:04:51+05:30 IST

రాష్ట్రానికి వరప్రసాదినిలాంటి పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు కాంగ్రెస్‌ పార్టీ మానస పథకం అని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొన్నందుకు వైసీపీ, టీడీపీలకు ధన్యవాదాలు అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు.

పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్‌ పథకం

ఒప్పుకున్న వైసీపీ, టీడీపీ : తులసిరెడ్డి 

వేంపల్లె, డిసెంబరు 3: రాష్ట్రానికి వరప్రసాదినిలాంటి పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు కాంగ్రెస్‌ పార్టీ మానస పథకం అని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొన్నందుకు వైసీపీ, టీడీపీలకు ధన్యవాదాలు అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. వేంపల్లెలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు 1980లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారన్నారు. ఆ తర్వాత 2004 వరకు ఏమాత్రం పురోగతి లేదని, 2004లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పరిపాలన అనుమతులు ఇచ్చి పనులు మొదలు పెట్టడం జరిగిందన్నారు. 2004-2014 మధ్య పాలనలో రూ.5136 కోట్లు ఖర్చు చేసి 32 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. 2014 ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం ద్వారా దీనిని జాతీయ ప్రాజెక్టుగా కాం గ్రెస్‌ హయాంలోనే గుర్తించడం జరిగిందని కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ 2014లో, 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ప్రాజెక్టులో పెద్దగా పురోగతి లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో నిధులు సాధించి త్వరితగతిన పూర్తి చేయాలని తులసిరెడ్డి సూచించారు.

Updated Date - 2020-12-04T05:04:51+05:30 IST