Advertisement

పోలవరంపై నీలినీడలు

Feb 28 2021 @ 12:04PM

అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ. 55,548.87 కోట్లు. అయితే దీనికి కేంద్రం ఇంకా ఆమోదం తెలపలేదు. ఏపీ సీఎం జగన్ ప్రకటించినట్లుగా తొలిదశలో నిర్వాసితులను తరలించేందుకు నిధులు కూడా మంజూరు కాలేదు. ఇప్పటి వరకు పొలవరం ప్రాజెక్టు పనుల నాణ్యతపై ఎవరూ వేలెత్తి చూపించలేదు. ఇటీవల కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ ఏబీ పాండ్య అధ్యక్షతన పోలవరంలో పర్యటించిన డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్.. కాఫర్ డ్యామ్‌కు వినియోగిస్తున్న మట్టి పనులు సహా హెడ్ వర్క్స్ పనులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. గేట్లకు మినహా కీలకమైన డిజైన్లకు ఈ ప్యానల్ ఆమోదం తెలిపే అవకాశం లేదని జనవనరుల నిపుణులు చెబుతున్నారు. 


మరోవైపు పోలవరం తుది అంచనా వ్యయంపై స్పష్టత రాలేదు. అదే విధంగా భూ నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టడంపై నిర్దేశించిన కాలవ్యవధి కూడా మరో 35 రోజుల్లో పూర్తి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సోమవారం ఉదయం పోలవరం ప్రాజెక్టుపై నిర్వహించే సమీక్షా సమావేశంపై ఆసక్తి నెలకొంది.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.