పరిశీలిస్తున్న కేంద్ర జలవిద్యుత్ సంఘం
పోలవరం, జూన్ 28 : పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర జల విద్యుత్ సంఘం బృందం మంగళవారం పరి శీలించింది. జల విద్యుత్ సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్‌ఎల్ కపిల్ నేతృత్వంలో సభ్యులు విపుల్‌నగర్, ఏకే భారతి, పీపీఏ డిప్యూటీ డైరెక్టర్ ప్రవీణ్, ఐఐటీ నిపుణులు సందీప్‌తో కూడిన బృందం ప్రాజెక్టులోని స్పిల్ వే, డయాఫ్రం వాల్‌ను పరిశీలించింది. బృందానికి ఎస్‌ఈ నరసింహమూర్తి, సి.సుధాకర్‌బాబు, ఈఈ మల్లికార్జున రావు పనులను వివరించారు. ప్రాజెక్టు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో గంటసేపు సమీక్ష జరిపారు.