పోలీసు డ్యూటీ మీట్ ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-04T04:45:22+05:30 IST
విశాఖ సిటీ పోలీస్ డ్యూటీ మీట్‌ను నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా గురువారం కమిషనరేట్ కార్యాలయంలో జ్యోతిప్రజ్వలనచేసి ప్రారంభించారు.
మహారాణిపేట, డిసెంబరు 3: విశాఖ సిటీ పోలీస్ డ్యూటీ మీట్‌ను నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా గురువారం కమిషనరేట్ కార్యాలయంలో జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. జనవరిలో జరిగే రాష్ట్ర స్థాయి పోలీస్ మీట్లో భాగంగా మూడు రోజులపాటు ఈ సిటీ పోలీస్ మీట్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ వి.సురేష్‌బాబు, ఎస్ఈబీ ఏడీసీపీ వి.అజిత, ఏడీసీపీ ఎం.రజని, ఇతర అధికారులు వేణుగోపాలనాయుడు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.