పోలీసులమని బెదిరించి డబ్బు పట్టుకుపోయారు

ABN , First Publish Date - 2021-03-01T05:55:22+05:30 IST

పేకాట ఆడుతున్న స్నేహితులను పోలీసులమని బెదిరించి డబ్బు పట్టుకుపోయిన నిందితులను రెండు గంటల్లో పట్టుకున్న సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

పోలీసులమని బెదిరించి డబ్బు పట్టుకుపోయారు

 రెండు గంటల్లో  ఛేదన.. పోలీసుల అదుపులో నిందితులు

ఉప్పల్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): పేకాట ఆడుతున్న స్నేహితులను పోలీసులమని బెదిరించి డబ్బు పట్టుకుపోయిన నిందితులను రెండు గంటల్లో పట్టుకున్న సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాక వీధి నంబర్‌.9 రాఘవేంద్ర  హాస్టల్‌లో  జైపాల్‌రెడ్డి, తన నలుగురు స్నేహితులతో కలిసి శనివారం పేకాట ఆడుతున్నాడు. కొందరు రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులమని చెప్పి  భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద నుంచి రూ.4,600ను తీసుకుని  ఉడాయించారు. అనుమానం వచ్చిన జైపాల్‌రెడ్డి ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు గంటల్లో నిందితులు బొంగు వెంకటేశ్‌, తాటికాయల రాజు, గూడల సంతో్‌షకుమార్‌, బొడ్డు మహే్‌షకుమార్‌, పేరాక అశోక్‌కుమార్‌, షేక్‌ సర్వర్‌, షేక్‌ ఫిరోజ్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.4,600 నగదు, రెండు బైకులు, మూడు లాఠీలను స్వాధీనం చేసుకున్నారు. రెండు గంటలలో కేసును  ఛేదించిన ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌నాయక్‌, డీఐ కాంతారెడ్డి, ఎస్సై గంగాధరరెడ్డిలను ఈస్ట్‌ జోన్‌ జాయింట్‌ కమిషనర్‌ రమే్‌షరెడ్డి, కాచిగూడా ఏసీపీ ఆకుల శ్రీనివాస్‌ అభినందించారు. 


Updated Date - 2021-03-01T05:55:22+05:30 IST