హైదరాబాద్‌‌లో బీ ఫార్మసీ విద్యార్థి అరెస్ట్

ABN , First Publish Date - 2021-02-25T15:29:46+05:30 IST

గురునానక్‌ ఇనిస్టిట్యూట్‌లో బీ ఫార్మసీ చదువుతున్నాడు.

హైదరాబాద్‌‌లో బీ ఫార్మసీ విద్యార్థి అరెస్ట్

హైదరాబాద్‌ : తనతోపాటు స్కూల్‌లో చదువుకున్న యువతిని ఆన్‌లైన్‌లో వేధింపులకు గురిచేస్తున్న‌ విద్యార్థిని రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ప్రాంతానికి చెందిన చెంబేటి చరణ్‌(20) ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ ఇనిస్టిట్యూట్‌లో బీ ఫార్మసీ చదువుతున్నాడు. ఓ యువతిని ప్రేమించగా.. ఆమె తిరస్కరించింది. ఆ యువతికి తల్లిదండ్రులు వేరే యువకుడితో పెళ్లి చేశారు. యువతిపై కక్ష పెంచుకున్న చరణ్‌ ఆమెకు సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన మెసేజ్‌లు, ఫొటోలు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. కొంతకాలంపాటు భరించిన యువతి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాచకొండ సైబర్‌క్రైం సిబ్బంది సాంకేతిక ఆధారాలతో నిందితుడు చరణ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-02-25T15:29:46+05:30 IST