12 ఏళ్ల బాలుడిని పొడిచి చంపిన ఎద్దు.. పోలీసులు ఆ ఎద్దును ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-06-10T08:33:54+05:30 IST

ఒక బాలుడు పొలం పక్క నుంచి నడుస్తూ ఉండగా.. ఆ పొలం దున్ను తున్న ఒక ఎద్దు అనుకోకుండా పరుగెత్తుకుంటూ వచ్చి ఆ బాలుడిని తన కొమ్ములతో పలుమార్లు దాడి చేసింది. ఆ దాడి తీవ్రంగా ఉండడంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు...

12 ఏళ్ల బాలుడిని పొడిచి చంపిన ఎద్దు.. పోలీసులు ఆ ఎద్దును ఏం చేశారంటే..

ఒక బాలుడు పొలం పక్క నుంచి నడుస్తూ  ఉండగా.. ఆ పొలం దున్ను తున్న ఒక ఎద్దు అనుకోకుండా పరుగెత్తుకుంటూ వచ్చి ఆ బాలుడిని తన కొమ్ములతో పలుమార్లు దాడి చేసింది. ఆ దాడి తీవ్రంగా ఉండడంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఎద్దుని, దాని యజమానిని అరెస్టు చేశారు. ఈ ఘటన సుడాన్ దేశంలో జరిగింది. 


ఆఫ్రికా ఖండంలోని దక్షిణ సుడాన్ దేశంలో ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ఆ పెంపుడు జంతువులను అక్కడి కోర్టులు కఠినంగా శిక్ష విధిస్తాయి. తాజాగా జరిగిన కేసులో ఎద్దుని మూడేళ్లపాటు మిలిటరీ క్యాంపులో కఠినమైన పనులు చేయించాలని.. ఆ తరువాత చనిపోయిన బాలుడి కుటుంబానికి ఆ జంతువుని అప్పచెప్పాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది.


ఇలాంటి ఘటన ఒకటి అదే దేశంలో గత మే నెలలో కూడా జరిగింది. ఒక కొమ్ములు తిరిగిన పొట్టేలు ఒక 45 ఏళ్ల మహిళపై దాడి చేసింది. ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. 


సుడాన్ దేశ చట్ట ప్రకారం.. ఆ పొట్టేలుని శిక్ష విధించారు. ఆ జంతువుతో రెండేళ్లపాటు బరువైన పనులు చేయిస్తారు. ఆ తరువాత బాధితుడి(మృతుడి) కుటుంబానికి అప్పగిస్తారు. పొట్టేలు కేసులో దాని యజమానికి కూడా కోర్టు శిక్ష విధించింది. మృతురాలి కుటుంబానికి ఆ పొట్టేలు, అయిదు ఆవులు నష్టపరిహారంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.


Updated Date - 2022-06-10T08:33:54+05:30 IST