Anna Canteen: తెనాలిలో టీడీపీ అన్నా క్యాంటిన్ వద్ద పోలీసుల మొహరింపు

ABN , First Publish Date - 2022-09-03T14:42:41+05:30 IST

జిల్లాలోని తెనాలిలో టీడీపీ అన్నా క్యాంటిన్ వద్ద భారీగా పోలీసులు మొహరించారు.

Anna Canteen: తెనాలిలో టీడీపీ అన్నా క్యాంటిన్ వద్ద పోలీసుల మొహరింపు

గుంటూరు: జిల్లాలోని తెనాలిలో టీడీపీ (TDP) అన్నా క్యాంటిన్ (Anna canteen) వద్ద భారీగా పోలీసులు మొహరించారు. మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గత నెల 12న అన్నా క్యాంటిన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా క్యాంటిన్ తీసేయాలంటూ రెండు రోజుల క్రితం  మున్సిపల్ అధికారులు (Municipal authorities)  నోటీసులిచ్చారు. ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నేడు కూడా ఆహారం పంపిణీ చేస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆందోళనలు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు మొహరించారు. దీంతో మార్కెట్ సెంటర్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడి షాపులను మూసువేయించారు. చిరు వ్యాపారులపైనా ఆంక్షలు విధించారు. పోలీసుల తీరుపై వ్యాపారులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-09-03T14:42:41+05:30 IST