విచారణ పేరుతో బాలుడిని చితకబాదిన పోలీసులు

ABN , First Publish Date - 2022-07-07T12:58:54+05:30 IST

వేమూరు ఎస్ఐ అనిల్ కుమార్ అరాచకమొకటి వెలుగు చూసింది. విచారణ పేరుతో రఫీ అనే బాలుడిని పోలీసులు చితకబాదారు.

విచారణ పేరుతో బాలుడిని చితకబాదిన పోలీసులు

Bapatla : వేమూరు ఎస్ఐ అనిల్ కుమార్ అరాచకమొకటి వెలుగు చూసింది. విచారణ పేరుతో రఫీ అనే బాలుడిని పోలీసులు చితకబాదారు. కోపం తగ్గకపోవడంతో కత్తితో బాలుడు తలపై ఎస్ఐ కోశాడు. భయపడిపోయిన రఫీ రక్తం ధారలతో బయటకు పరుగులు పెట్టాడు. రఫీ గాయాలను చూసి అతని తల్లి స్పృహ కోల్పోయింది. తల్లి తలకు గాయాలు, బాధితులను ఆస్పత్రికి తరలించారు. యువకుల మధ్య గొడవకు పోలీస్ స్టేషన్‌లో సెటిల్‌మెంట్‌ పంచాయితీ జరిగింది. పంచాయతీకని పిలిచి రఫీని తీవ్రంగా కొట్టారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2022-07-07T12:58:54+05:30 IST