Viral Video: పోలీస్ కాలర్ పట్టుకుని.. చెప్పడం కాదు గానీ ఈ వీడియోలో మీరే చూడండి..

ABN , First Publish Date - 2022-06-20T22:29:54+05:30 IST

ప్రజలను రక్షించాల్సిన పోలీసులే వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ అప్పుడప్పుడూ వార్తలు రావడం చూసి ఉంటారు. సామాన్యులతో పోలీసులు అమర్యాదగా..

Viral Video: పోలీస్ కాలర్ పట్టుకుని.. చెప్పడం కాదు గానీ ఈ వీడియోలో మీరే చూడండి..

ప్రజలను రక్షించాల్సిన పోలీసులే వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ అప్పుడప్పుడూ వార్తలు రావడం చూసి ఉంటారు. సామాన్యులతో పోలీసులు అమర్యాదగా ప్రవర్తించిన ఘటనలూ గతంలో చాలానే ఉన్నాయి. కానీ.. కొన్ని సందర్భాల్లో పోలీసులతో కూడా కొందరు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఈ మధ్య పెరిగిపోతున్నాయి. కేరళలో ఒక పోలీసుపై (Kerala Cop) ఒక వ్యక్తి కత్తితో దాడికి యత్నించిన ఘటన (Man attacks Kerala cop with machete) మరువక ముందే తాజాగా మరో వీడియో ఇంటర్నెట్‌లో (Internet) వైరల్‌గా (Viral) మారింది. ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు గానీ జరిగిన ఘటన మాత్రం ఆ వీడియో (Viral Video) చూసిన నెటిజన్లకు (Netizens) షాకింగ్‌గా అనిపించింది. ఒక పోలీసును యువతి ఒంటి కాలితో తన్నేందుకు యత్నించింది. కాలర్ పట్టుకుని ఆ ఖాకీపై పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ నానా రచ్చ చేసింది. ఆ యువతి మద్యం మత్తులో అలా ప్రవర్తించిందో లేక ఉద్దేశపూర్వకంగానే ఆ పోలీసుతో అలా ప్రవర్తించిందో తెలియాల్సి ఉంది.



ఈ వీడియోను జర్నలిస్ట్ సాగర్ కుమార్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో కనిపించిందేంటంటే.. రాత్రి సమయంలో విధుల్లో ఉన్న ఒక పోలీస్ ఫోన్ మాట్లాడుతున్నాడు. అతని ఖాకీ కాలర్ పట్టుకుని ఆ యువతి నానా హంగామా చేస్తోంది. అంతటితో ఆగకుండా ఆ పోలీసును కాలితో తన్నేందుకు యత్నించింది. అతనికి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది. అతను పెట్టుకున్న ఫేస్ మాస్క్‌ను తీసేసి ‘మాస్క్.. మాస్క్’ అంటూ వెకిలిగా అరుస్తూ ఆ మాస్క్‌ను కిందపడేసింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అసలు అంత పొగరుగా ప్రవర్తించడం వెనుక ఆ యువతి ధైర్యం ఏంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుండగా, మరికొందరు ఆ పోలీసు నిస్సహాయ స్థితిని చూసి సానుభూతి వ్యక్తం చేశారు. ఆ యువతి మద్యం మత్తులో ఉండటం వల్లే అలా ప్రవర్తించిందని, ఆ పోలీసు వయసు, వృత్తికి కనీస గౌరవం ఇవ్వాలన్న విషయాన్ని కూడా ఆమె విస్మరించిందని కొందరు ట్విట్టర్ యూజర్లు అభిప్రాయపడ్డారు.



ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. ఇటీవల ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్ దగ్గర ఛలానా విషయంలో ట్రాఫిక్ పోలీసుతో ముగ్గురు వ్యక్తులు గొడవ పెట్టుకున్నారు. వారిలో ఇద్దరు మహిళలే కావడం గమనార్హం. రాంగ్ రూట్‌లో త్రిబుల్ రైడింగ్ చేసిందే కాక దురుసుగా ప్రవర్తించడంతో సదరు పోలీసు జరిమానా విధించాడు. ఈ విషయంలో ఆ ముగ్గురూ పోలీసుతో గొడవపడ్డారు. ఆ ఇద్దరు మహిళల్లో ఒక మహిళ మరో అడుగు ముందుకేసి ఆ పోలీసుపై భౌతిక దాడికి దిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ముగ్గురికి మద్దతుగా మరికొందరు కూడా అక్కడికి చేరి సదరు పోలీసుతో అమర్యాదగా ప్రవర్తించారు. ఈ వ్యవహారంలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-06-20T22:29:54+05:30 IST