ఉపాధ్యాయులను అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-01-21T04:51:42+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకం గా గురువారం కడపలో జరిగే మహాధర్నాకు వెళుతున్న ఫ్యాప్టో నాయకులను పోరుమామిళ్ల పోలీసులు అడ్డుకొని కొన్ని గంటల తరువాత వదిలేశారు.

ఉపాధ్యాయులను అడ్డుకున్న పోలీసులు
మహాధర్నాకు వెళ్లకుండా ఫ్యాప్టో నాయకులను అడ్డుకున్న పోలీసులు

పోరుమామిళ్ల, జనవరి 20 : ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకం గా గురువారం కడపలో జరిగే మహాధర్నాకు వెళుతున్న ఫ్యాప్టో నాయకులను పోరుమామిళ్ల పోలీసులు అడ్డుకొని కొన్ని గంటల తరువాత వదిలేశారు. గురువారం పోరుమామిళ్ల నుంచి ఫ్యాప్టో ఆధ్వర్యంలో సురేద్రనాధ్‌రెడ్డి, బాలరాజు, గురువయ్య, సురేష్‌, అబ్దుల్‌, వెంకటరమణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో వాహనంలో వెళ్లడానికి ప్రయత్నించగా విషయం తెలుసుకున్న పోలీసులు వారిని వెళ్లకుండా అడ్డుకున్నారు. 

Updated Date - 2022-01-21T04:51:42+05:30 IST