Hyderabad లో వీకెండ్ పార్టీ భగ్నం.. 44 మంది యువకులు.. ఇద్దరు హిజ్రాల అరెస్ట్

ABN , First Publish Date - 2021-11-28T19:45:59+05:30 IST

Hyderabad లో వీకెండ్ పార్టీ భగ్నం.. 44 మంది యువకులు.. ఇద్దరు హిజ్రాల అరెస్ట్

Hyderabad లో వీకెండ్ పార్టీ భగ్నం.. 44 మంది యువకులు.. ఇద్దరు హిజ్రాల అరెస్ట్

హైదరాబాద్ : నగరంలోని కూకట్‌పల్లిలో వీకెండ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పూర్తి వివరాల్లోకెళితే.. వివేక్‌నగర్‌లోని ఓ ఇంటిపై ఆదివారం మధ్యాహ్నం ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద మొత్తంలో మద్యం, హుక్కా బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. కొంత మంది యువకులు వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఇలా పార్టీలను నిర్వహిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా ఇలా యువకులు వీకెండ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలియవచ్చింది. ఈ పార్టీకి వచ్చే ఒక్కొక్కరి నుంచి నిర్వాహకులు రూ.300 తీసుకుంటున్నట్లు తేలింది. వివేక్‌నగర్‌లోని ఓ ఇంటిని రూ.60 వేలకు అద్దెకు తీసుకున్న నిర్వాహకులు ఇలా పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



Updated Date - 2021-11-28T19:45:59+05:30 IST