పోలీస్‌ వర్సెస్‌ టీడీపీ

ABN , First Publish Date - 2022-06-29T05:42:08+05:30 IST

ఏలూరు జిల్లా భీమడోలులో కొద్దిరోజుల క్రితం హత్యారోపణపై ఇద్దరు టీడీపీ కార్యకర్తలను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆరు రోజులు కస్టడీలో ఉంచుకున్న తర్వాత ఆసుపత్రికంటూ మంగళవారం వారిని వారి సొంత పామాయిల్‌ తోటకు రహస్యంగా తీసుకెళ్లారు. విషయం తెలిసిన స్థానిక టీడీపీ నాయకులు పోలీసులను అనుసరించారు.

పోలీస్‌ వర్సెస్‌ టీడీపీ

హత్యారోపణతో ఇద్దరు టీడీపీ కార్యకర్తల అరెస్ట్‌

గంజాయి కేసు బనాయించేందుకు యత్నం  

చికిత్స పేరుతో పామాయిల్‌ తోటకు తరలింపు

మానసిక వేదనతో పురుగుల మందు తాగిన తల్లి 

భీమడోలులో ఉద్రిక్తత.. తహసీల్దార్‌ 

కార్యాలయం ఎదుట తెలుగుదేశం ధర్నా


ఏలూరు జిల్లా భీమడోలులో కొద్దిరోజుల క్రితం హత్యారోపణపై ఇద్దరు టీడీపీ కార్యకర్తలను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆరు రోజులు కస్టడీలో ఉంచుకున్న తర్వాత ఆసుపత్రికంటూ మంగళవారం వారిని వారి సొంత పామాయిల్‌ తోటకు రహస్యంగా తీసుకెళ్లారు. విషయం తెలిసిన స్థానిక టీడీపీ నాయకులు పోలీసులను అనుసరించారు. తోటలో ఉన్న కంటైనర్లో పోలీసులే గంజాయి ప్యాకెట్లు పెట్టి వారిపై అక్రమ కేసు బనాయించారంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తన బిడ్డలను అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారని అనుమానితుల తల్లి అక్కడకు చేరుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  భీమడోలు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు, బాధితుల కుటుంబీకులు ధర్నా చేశారు. న్యాయం కోసం డిమాండ్‌ చేశారు.  


బీమడోలు, జూన్‌ 28 : భీమడోలుకు చెందిన గంజి మగేశ్‌ (33), మనోజ్‌ (30) అనే ఇద్దరు సోదరులు స్థానికంగా టీడీపీ కార్యకర్త లుగా చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు. మనోజ్‌కు అతని మావయ్య అయిన మొగలపు సత్యనారాయణ(73) కుమార్తె అయిన పుష్ప రాణితో పదేళ్ల క్రితం వివాహమైంది. కాగా సత్యనారాయణ ఎనిమిది నెలల క్రితం గుండె పోటుతో మరణించారు. బంధువుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే పది రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన మద్దా కళ్యాణ్‌ అలియాస్‌ బాబి అనే వ్యక్తి సత్య నారాయణది సాధారణ మరణం కాదని, తాను మధ్యవర్తిగా ఉండి వేరే వ్యక్తికి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలిపాడని పోలీ సులు చెబుతున్నారు. ఆ హత్యను మగేశ్‌, మనోజ్‌లే చేయించారని ఆరోపించాడు. దీంతో హత్యారోపణ కింద ఆ ఇద్దరినీ ఆరు రోజుల క్రితం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్‌ విధిం చకుండా ఆరు రోజులుగా ఇద్దరినీ విచారణ పేరిట స్టేషన్లోనే ఉంచా రు. మంగళవారం మధ్యాహ్నం ఆ ఇద్దరినీ వైద్య చికిత్సల కోసమని చెప్పి ద్వారకా తిరుమల రోడ్డులోని వారి పామాయిల్‌ తోటలోకి పోలీసులు తీసుకెళ్లారు. ఈ ఘటనలో భీమడోలు ఎస్‌ఐ చావా సురేశ్‌, గణపవరం సీఐ వెంకటేశ్వర్రావు, ఎమ్మార్వో సుబ్బారావుతో పాటు ఇతర పోలీసులు పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కుమారుడు భరత్‌కుమార్‌, స్థానిక టీడీపీ నాయకులు తోటకు వెళ్లారు. అక్కడ కంటైనర్లో పోలీసులే స్వయంగా కొన్ని గంజాయి ప్యాకెట్లను పెట్టారని టీడీపీ నాయకులు ఆరోపించారు. అయితే మగేశ్‌, మనోజ్‌ గంజాయి వ్యాపారం చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న స్థానికులు, బాధితుల కుటుంబీకులు పోలీసులే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆందోళనకు చేశారు. టీడీపీ నాయకులు గళమెత్తారు. పట్టించుకోని పోలీసులు ఎవరినీ లెక్క చేయలేదు.


పురుగుల మందు తాగిన తల్లి

అనుమానితుల తల్లి మంగతాయారు ఘటనా స్థలికి వెళ్లి.. తన బిడ్డల ను అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారని బోరున విలపించారు. తన పిల్లలతో ఒకసారి మాట్లాడనివ్వాలని పోలీసులను వేడుకుంది. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీ సులు ఆమెను తోసే శారు. దీంతో అదుపు తప్పిన ఆమె కింద పడిపోయింది. పోలీసుల వైఖరితో మరింత ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు తాగింది. ప్రాణా పాయ స్థితిలో వున్న ఆమెను కుటుంబీకులు ఏలూరు ప్రభుత్వాసు పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అప్పటికే అక్కడకు చేరుకున్న గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని బైఠా యించి ధర్నాకు దిగారు. పారదర్శకంగా విచారణ చేయాలని, హత్యారోపణలు నిజమే అయితే న్యాయపరంగా తామూ సహకరిస్తా మని, లేని కేసులు బనాయిస్తే మాత్రం ఊరుకోబోమని గన్ని తెలిపారు. 


ఎవరీ కళ్యాణ్‌ ?

గంజి మగేశ్‌, మనోజ్‌పై హత్యారోపణలు చేసిన కళ్యాణ్‌ గతంలో వీరి స్నేహితుడే. ఇటీవల మగేశ్‌ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. దీనికి కళ్యాణ్‌ను ఆహ్వానించకపోవడంతో అతను వీరితో గొడవకు దిగా డని చెబుతున్నారు. అనంతరం కళ్యాణ్‌ ఓ అధికార పార్టీ నాయకుడిని కలిశాడని, అతని సలహా మేరకే అన్నదమ్ములపై ఆరోపణలు చేశాడని స్థానికులు చెబు తున్నారు. ఎనిమిది నెలల క్రితం మరణించిన సత్యనా రాయణకు అల్లుడైన మనోజ్‌, అతని సోదరుడు మగేశ్‌ కు గానీ ఎలాంటి వివాదాలు లేవని బంధువులు, స్థానికులు అంటున్నారు. పైగా రెండేళ్ల క్రితమే సత్య నారాయణ తన ఆస్తిని కుమార్తె పేరిట రాసేశారని అటువంటప్పుడు హత్య చేయాల్సిన అవసరమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కావాలనే టీడీపీ నాయ కులుగా ఎదుగు తున్న అన్న దమ్ములపై కక్ష గట్టి అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంత వివాదం జరిగిన అనంతరం మంగళవారం సాయంత్రం తర్వాత పోలీసులు రిమాండ్‌ కోరారు. ఏలూరు మేజిస్ర్టేట్‌ వద్దకు అను మానితులైన మగేశ్‌, మనోజ్‌ను తీసుకు వెళ్లగా పోలీ సులు 302 కేసు కింద కేసు నమోదు చేసినట్లు వివ రించాక మేజిస్ర్టేట్‌ రిమాండ్‌కు అనుమతినిచ్చారు. 


ముమ్మాటికీ అక్రమ కేసులే  : టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు 

పార్టీలో కీలకంగా పనిచేస్తోన్న కార్యకర్తలు, నాయకులను కట్టడి చేసేందుకు అధికార పార్టీ నాయకులు తెర వెనుక నుంచి ఈ వ్యవహారం నడిపిస్తున్నారని, దీనికి పోలీసులు సహకరిస్తున్నారని గన్ని ఆరోపించారు. దారిన పోయే దానయ్యలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా టీడీపీ నాయకు లపై పోలీసులు కేసులు పెడుతున్నారని, అందులో భాగం గానే ఈ హత్య కేసు బనాయించారన్నారు. దీనిపై పోలీసులు పూర్తిస్థాయి ఆధారాలు ఉన్నాయని తనకు చెప్పడంతో తాను గానీ, బాధితుల కుటుంబ సభ్యులు గానీ తల దూర్చలేద న్నారు. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతోనే అధికార పార్టీ నాయకుల ప్రోద్భలంతో పోలీసులు ఈ గంజాయి కేసును బనాయిం చేందుకు చూస్తున్నారన్నారు. ఆరు రోజులపాటు స్టేషన్లో ఉంచి కొడతారా..? అని ప్రశ్నించారు. వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చి పామాయిల్‌ తోటలో గంజాయి సంచులు ఉంచి కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ ఎందుకంటూ నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసేయొచ్చుగా అంటూ పోలీసుల వైఖరిపై ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో పోలీసులను ముందుంచి వెనుక నుంచి నడిపించే వారిని వదిలే ప్రసక్తే లేదని, ఎంత దూరమైనా వెళ్తానని గన్ని హెచ్చరించారు. పోలీసులు పామాయిల్‌ తోటకు వెళుతున్న సమాచారం అందుకుని వారి వెనుకే వెళ్లిన భరత్‌ను పోలీసులు బూతులు తిడుతూ, బయటకు తోసేస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. 


నేరం ఒప్పుకోమని హింసిస్తున్నారు :  తల్లి మంగతాయారు

తన కొడుకులు ఇద్దరిని ఐదు రోజులుగా చిత్ర హింస లు పెడుతూ కర్కశంగా కొట్టారని, తాము చనిపోతామం టూ కుమారులు ఇద్దరు కన్నీటి పర్యంతమయ్యారని తల్లి మంగతాయారు తెలిపారు. ఉదయం ద్వారకా తిరుమల సమీపంలోని పోలసానపల్లిలో తమ పొలంలోకి కొడు కులు ఇద్దరిని పోలీసు వ్యానులో తీసుకు వచ్చిన గంజా యి సంచులను అక్కడ పెట్టి ఫొటోలు తీయించారని విషయం తెలుసుకున్న తాను, భర్త అక్కడకు చేరుకుని అన్యాయంగా అక్రమ కేసులు బనాయిస్తారా అని సీఐ, ఎస్‌ఐలను నిల దీస్తే తనపై దాడికి తెగబడ్డారని మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డినట్లు తెలిపారు. స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారని తెలిపారు. ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి పోలీసులకు కుమారులు ఇద్దరిని తీసుకువెళ్లి అప్పటి నుంచి రోజూ నేరం ఒప్పుకో మని తీవ్రంగా హింసిస్తున్నారని అవి భరించలేక కుమారులు ఇద్దరు చచ్చి పోతామం టున్నారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. వైసీపీ నాయకులు ప్రోద్బలంతోనే అక్రమ కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు.  


నాన్నది సహజ మరణమే : గంజి పుష్పరాణి, సత్యనారాయణ కుమార్తె

మా నాన్న సత్యనారాయణకు గతంలో రెండుసార్లు గుండెపోటు వచ్చింది. అప్పట్లో నా భర్త మనోజే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. మళ్లీ ఎనిమిది నెలల క్రితం బండిపై వెళ్తుండగా, భీమడోలు హైస్కూల్‌ సమీపంలో తీవ్రపోటుతో కిందపడి మృతి చెందారు. కావాలనే పోలీసులు మగేశ్‌, మనోజ్‌పై హత్య కేసు బనాయించారు. 






Updated Date - 2022-06-29T05:42:08+05:30 IST