కేసు పెట్టొద్దంటే ముద్దవ్వు.. పోలీసు గలీజు పని.. కెమెరాలో రికార్డవడంతో..

ABN , First Publish Date - 2021-02-19T20:42:06+05:30 IST

కేసు పెట్టకుండా ఉండేందుకు కొందరు పోలీసులు లంచం తీసుకోవడం చూస్తుంటాం. అయితే ఆ లంచం నగదు రూపంలో, లేదా వస్తువుల రూపంలో ఉంటుందని మనకు తెలుసు. అయితే పెరూలోని ఓ పోలీస్ ఆఫీసర్ మాత్రం ఓ యువతిపై..

కేసు పెట్టొద్దంటే ముద్దవ్వు.. పోలీసు గలీజు పని.. కెమెరాలో రికార్డవడంతో..

ఇంటర్నెట్ డెస్క్: కేసు పెట్టకుండా ఉండేందుకు కొందరు పోలీసులు లంచం తీసుకున్న ఘటనలు మనం వింటూనే ఉంటాం. అయితే ఆ లంచం నగదు రూపంలో, లేదా వస్తువుల రూపంలో ఉంటుందని మనకు తెలుసు. అయితే పెరూలోని ఓ పోలీస్ ఆఫీసర్ మాత్రం ఓ యువతిపై కేసు పెట్టకుండా వింత లంచం తీసుకున్నాడు. అదేంటో తెలుసా..? ఓ ముద్దు. అవునండి.. నిబంధనలను అతిక్రమించినందుకు గానూ ఆమెపై కేసుపెట్టాల్సిన సదరు పోలీసు.. తనకు ముద్దిస్తే కేసు పెట్టనని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ముద్దు పెట్టింది. అయితే ఆ ముద్దు ఘటన జరిగిన ప్రదేశంలో ఓ సీసీ కెమెరా ఉండడంతో అతడి బండారం బట్టబయలైంది. ఈ వీడియోను అక్కడి ఓ టీవీ చానల్ ప్రసారం చేయడంతో విపరీతంగా వైరల్ అయింది. దీంతో అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు.

Updated Date - 2021-02-19T20:42:06+05:30 IST